Tricks and Tips

Thursday, January 16, 2014

మేడిపండు తంతు ...........!


లొట్టి పిట్ట , లొట్టి పిట్ట , నా రాణి
లొట్టి పిట్ట మీదకెక్కు నా రాణి
లొట్టి పిట్ట మీదకెక్కు నా రాణి
లోకమంత చూపుతానే నా రాణి

లొట్టి పిట్ట , లొట్టి పిట్ట నా రాజా
లొట్టి పిట్ట మీదకెక్కా నా రాజా
లొట్టి పిట్ట మీదకెక్కా నా రాజా
లోకమంత చూపుతావా నా రాజా

పట్టణం తీసుకెళ్ళు నా రాజా
పట్టపగలే వెన్నెలంట నా రాజా
పట్టరాని ఆనందంతో నా రాజా
పులకరించిపోతా నేను నా రాజా

మేడిపండు తంతు అంతా నా రాణి
మెరిసిపోతూ కనిపిస్తాది నా రాణి
వావి వరుస వాడిపోయె నా రాణి
విలువలన్ని మసకబారే నా రాణి

పట్టణంలో పట్టపగలు నా రాజా
మందు బాబులు చిందులేసె నా రాజా
మంచి చెడు మరచిపోయి నా రాజా
మానవత్వం మంట కలిపే నా రా
జా
 
మోసే నలుగురు లేని చోట నా రాజా
మోపలేను కాలు నేను నా రాజా
ఓపలేని బాధలెన్నో నా రాజా
ఓర్చుకుని చూడలేను నా రాజా

లోకమంత ఇంతేతీరే నా రాణి
లోకం లోతు చూడలేవు నా రాణి
మన పల్లే మనకు స్వర్గమే నా రాణి 
తిరిగి మన పల్లెకు పోదాం నా రాణి

లొట్టి పిట్ట , లొట్టి పిట్ట , నా రాణి
లొట్టి పిట్ట మీదకెక్కు నా రాణి
లొట్టి పిట్ట మీదకెక్కు నా రాణి
తిరిగి మన పల్లెకు పోదాం నా రాణి 


**********

10 comments:

  1. Quite apt and interesting :)

    ReplyDelete
    Replies
    1. శర్మగారు మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  2. పట్నంలో ఏముందండి.. అది పట్నంలో బతుకున్న మా లాంటి వారికి స్పష్టంగా తెలుస్తుంది.
    మనిషి ముసుగేసుకున్న మరమనుషులు తప్ప ఇక్కడ ఇంకెవ్వరూ లేదు. కార్ల్ మార్క్స్ చెప్తే గతంలో నవ్వుకున్నాను గాని.. నిజమే మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే... ముఖ్యంగా పట్టణాల్లో. ఇప్పటికీ పండగంటే పల్లె గుర్తొస్తుంది. అక్కడ మా ఇల్లు, పచ్చదనమే కళ్ల ముందు కనిపిస్తుంది.
    సరదాగా సాగిపోయిన మీ పాటలో... ఎంతో అంతరార్ధం ఉంది. బాగుందండీ...

    ReplyDelete
    Replies
    1. నిజమే మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే... ఈ భావనే ఎంతో బాధ కలిగిస్తుంది . కానీ వాస్తవాన్ని జీర్ణించుకోక తప్పదు కదా ...సతీష్ గారు మీ స్పందనలకు ధన్యవాదములు .

      Delete
  3. దేవీ,చిన్నప్పుడు లొట్టిపిట్ట అంటే పక్షి అనుకొనేదాన్ని తెలుసా...
    పోనీలే ఈ టీచరమ్మ పుణ్యమా అని పిల్లలకి తెలుస్తుంది.
    నాకో అయిడియా వచ్చిందోయ్ .... ఈ జానపద పాటలన్నీ పెట్టి మనం ఓ మాంచి సినిమా తీద్దామా..(అయిడియా మనజీవితాలనే "మాడ్చేస్తుంది" చూసుకోమరి, )మీవారికీ, మావారికీ చెరో జత కాషాయం కొనిద్దాం :-))

    ReplyDelete
    Replies
    1. జీవితాల్ని మార్చేస్తే వాళ్ళకి కాషాయాలు కొనిచ్చినా సంతోషంగా వెళతారు..పాపం మంచివాళ్ళు కదా .మాడ్చేస్తుందని తెలిసీ ఎలా వెళతారు , మనకి మందు రాయాలిగా ...వెళ్ళరు ,పాపం మంచి వాళ్ళుగా మెరజ్ ఈ సారికి వద్దులే .

      Delete
  4. ఊ... సరేలే ఇంకో అయిడియా వచ్చేలోగా నువ్వో పాట రాసేసుకో...(ఏక సంభోదనకు సారీ్)

    ReplyDelete
    Replies
    1. ఫర్వాలేదు మీరజ్ అలా పిలవవచ్చు ఆ హక్కు మీకిచ్చా . కాషాయాలు సర్దేసి కలము , కాగితము తీసుకున్నాను .

      Delete
  5. అమాయకత్వపు పరదా తీసి చూస్తే అంతా మేడిపండు తంతే
    లొట్టి పిట్ట, లొట్టి పిట్ట, నా రాణి .... లొట్టి పిట్ట మీదకెక్కు నా రాణి, లొట్టి పిట్ట మీదకెక్కు నా రాణి .... మన పల్లెకు మనం పోదాం నా రాణి! అనిపించేలా

    కొత్త కొత్త రుచుల్ని పల్లెల పచ్చదనాన్ని అక్షరాల్లో ఆవిష్కరిస్తూ చాలా బాగుంది భావం
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనల సుగంధాలను ఆస్వాదిస్తూ , ధన్యవాదములు చంద్రగారు .

      Delete