తలపాగా సుట్టుకొని - అయ్యలార , అన్నలార
నడుం సుట్టూ కొంగు సుట్టి -అమ్మలార , అక్కలార
పల్లెసీమ పిలిసిందీ - కదలుదాం
తల్లి సేవ సేయగాను - తరలుదాం
పల్లెసీమ పిలిసిందీ - అయ్యలార , అన్నలార
జనం కదలి రారండీ -అమ్మలార , అక్కలార
పట్టుబట్టి మనమంతా -తమ్ముడా
సుబ్బరం సేద్దాము -సెల్లెలా
పలుగు , పార తీసుకుని -అయ్యలార , అన్నలార
మొక్క సేత బట్టుకొని -అమ్మలార , అక్కలార
సక్కగాను నాటుదాము -తమ్ముడా
పచ్చదనం పెంచుదాం -సెల్లెలా
సేట , సీపురట్టుకొని -అయ్యలార , అన్నలార
ఊరినంత ఊడుద్దాం -అమ్మలార , అక్కలార
ఎగరేసిన సెత్తంతా -తమ్ముడా
ఎత్తబోను సిగ్గేలా -సెల్లెలా
పలక , బలపం సేతబూని -అయ్యలార , అన్నలార
సదువుకోను బడికెలదాం -అమ్మలార , అక్కలార
వయసుతోటి పనియేటి -తమ్ముడా
బతుకుదిద్దుకుందుకూ -సెల్లెలా
బడి ఈడు పిల్లల్నీ -అయ్యలార , అన్నలార
సదువుకోను పంపుదాం -అమ్మలార , అక్కలార
పుత్తకాలు , అన్నమూ -తమ్ముడా
బట్టలూ కరుసు లేదు -సెల్లెలా
ఆడపిల్లలంటు మనం -అయ్యలార , అన్నలార
అలుసుసేయవద్దూ -అమ్మలార , అక్కలార
అందనంత ఎత్తుకూ -తమ్ముడా
ఆడపిల్లలెదిగె సూడు -సెల్లెలా
సిన్న పిల్లలప్పుడే -అయ్యలార , అన్నలార
పెల్లిసేసి పంపొద్దు -అమ్మలార , అక్కలార
బంగారు జీవితాన్ని -తమ్ముడా
బలిసేయవద్దు మనం -సెల్లెలా
సేయి సేయి కలిపితేను -అయ్యలార , అన్నలార
సేయలేనిదేముందీ -అమ్మలార , అక్కలార
సోగతం పలుకుదాం -తమ్ముడా
సక్కనీ పల్లెకూ -సెల్లెలా
మన పల్లె సూసినోల్లు -అయ్యలార , అన్నలార
తమ పల్లె మార్సాలి -అమ్మలార , అక్కలార
పల్లెసీమ సేవయే -తమ్ముడా
కన్నతల్లి సేవలే -సెల్లెలా
పల్లెసీమ సేవే -కన్నతల్లి సేవరా
పల్లెసీమ సేవే -కన్నతల్లి సేవరా
పల్లెసీమ సేవే -కన్నతల్లి సేవరా
పల్లెసీమ సేవే -కన్నతల్లి సేవరా
***********************
అరె ,దేవీ మీరు పాటలు కూడా రాస్తున్నారు, ఇంకేం సినిమాకి రాసేయండి,
ReplyDeleteఅయిడియా ఇచ్చినందుకు నాకు సగం. సోదరిద్రోహానికి తలపడ్డారనుకో....సినిమా ప్లాప్ :-))
నా వద్ద ద్రోహానికి తావులేదు . సొదరికీ , స్నేహితురాలికీ చెరో సగం .సినిమా హిట్...శ్రీదేవికి పేరు ఓకేనా మీరజ్ ,హరితా బ్లాగ్ సాక్షిగా మాట ఇస్తున్నాను.
Deleteతలపాగా సుట్టుకొని - నడుం సుట్టూ కొంగు సుట్టుకొని -అమ్మలార , అక్కలార పల్లెసీమ పిలిసిందీ - కదలుదాం తల్లి సేవ సేయగాను - తరలుదాం పలుగు , పార తీసుకుని - మొక్క సేత బట్టుకొని - సేట , సీపురట్టుకొని - పలక , బలపం సేతబూని - చాలా చక్కని భావం .... బాగా రాస్తావు జానపద మనసు గీతాలు అభినందనలు శ్రీదేవి!
Deleteనా జానపద గీతాలన్నన్నింటిని మనసు పెట్టి , చదివి మనసు పెట్టి అభినందనలు తెల్పినందుకు మనఃపూర్వక ధన్యవాదములు చంద్రగారు.
Deleteఅంటే...నేను మనస్సు పెట్టటం లేదా... పో ఇకముందు అస్సలు చదవను , అయినా ఈ చంద్రగారింతే...బుద్దిగా ఉండి మార్కులు కొట్టేస్తారు.
Deleteఅక్క,చెల్లెళ్ళు....స్నేహితులూ......మనది చదవడానికీ , మన గురువులు మనది చదివి మెచ్చుకుంటానికీ......ఎంత తేడా ఉంటుందో తెలియనిదేముంది మీరజ్........అర్ధం చేసుకోరూ........ప్లీజ్.........
Deleteఒకే...ఓకే...అర్దమయిందిలే చెల్లెమ్మా..
Deletenaaku sagam
ReplyDeletenaaku sagam :-) chalaa baagundi
తలపాగా సుట్టుకొని - నడుం సుట్టూ కొంగు సుట్టుకొని -అమ్మలార , అక్కలార పల్లెసీమ పిలిసిందీ - కదలుదాం తల్లి సేవ సేయగాను - తరలుదాం పలుగు , పార తీసుకుని - మొక్క సేత బట్టుకొని - సేట , సీపురట్టుకొని - పలక , బలపం సేతబూని - చాలా చక్కని భావం .... బాగా రాస్తావు జానపద మనసు గీతాలు అభినందనలు శ్రీదేవి!
ReplyDelete