ఎందుకు ?
ఎందుకిలా జరుగుతోంది ?
సమాజం ఎటువైపు పోతోంది ?
మగవాడి నైచ్యానికి అంతే లేదా ?
వయసుకు తగినట్లు మనసు పెరగదా?
కామప్రకోపాలకు హద్దులేదా ?
అతనిలోని మానవత్వం చచ్చిపోయిందా ?
లేక అసలు మానవత్వమే లేదా ?
ఎంచుకున్న వృత్తి ఏమిటి ?
చేస్తున్న పని ఏమిటి ?
ఇంక ఇటువంటి ఉపాధ్యాయులు....
ఒక మంచి సమాజాన్ని ఎలా నిర్మించగలడు ?
పిల్లల్లో నైతిక విలువలు ఎలా పెంపొందింప చేయగలడు ?
ఆరోగ్యకరమైన వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఎలా చేపట్టగలడు ?
వాడి పిల్లల వయసున్న పిల్లలను కామంతో ఎలా చూస్తున్నాడు ?
ఆ పసిపిల్లలను చూస్తుంటే మనోవికార చేష్టలు
ఎలా ఉత్పన్నమవుతున్నాయి ?
తరగతిగదిలోని ఆడపిల్లలు కామప్రతీకలా వాడికి ?
వాడి శరీరానికి ఆటవస్తువులా ?
ఆ కామాంధుని చేతికి చిక్కిన చేపపిల్లలా ?
పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు ?
వయసుకు తగిన ప్రవర్తన సాధ్యం కాదా ?
ఇటువంటి ఉపాధ్యాయుడుంటే తల్లిదండ్రులు తమ
ఆడపిల్లల్ని చదివించడానికి పాఠశాలకు పంపిస్తారా ?
ఆడపిల్లల భవిష్యత్తు ఏమైపోతోంది ?
అసలు వారికి భవిష్యత్తు ఉంటుందా ?
ఆడపిల్లల్ని చదివించుకోవాలనే కోరిక కూడా అత్యాశేనా ?
ముందు ముందు ఆడపిల్లలు గడప దాటే అవకాశాలు
కూడా ఈ సంఘటనలవల్ల మృగ్యమైపోతాయేమో ?
తల్లి,తండ్రి,అన్న,తాతయ్య,మామయ్య,బాబాయి.....
ఇలా ఎవరు వెంట ఉన్న ఆడపిల్లలను
కాపాడుకోలేక పోతున్నారు ఎందుకు?
కౄరమృగాల మధ్య సంచరిస్తున్నామా ?
లేక సమాజంలోనే ఉన్నామా ?
వాడి పిల్లల్నైతే పసిపిల్లల్లా భావిస్తాడే ?
వాడి పిల్లలైతే చల్లగా ఉండాలే ?
వాడి పిల్లల వంక ఎవరైనా చూస్తే కళ్ళెర్ర బడతాయే ?
వారిపై వువ్వెత్తునలేచి మండిపడతాడే ?
వాడి అక్క,చెల్లెళ్ళు ఆనందంగా ఉండాలే ?
వాడి భార్య పవిత్రంగా ఉండాలే ?
మరి ఇతరులు ?
వాడి నీచ ఉద్ధేశ్యానికి ప్రత్యక్ష సాక్షి
వాడి అంతరాత్మే కదా?
ఏం సాధించడానికి ఈ నికృష్టపు చేష్టలు ?
ఇటువంటి వాడి చొక్కా చింపి,
చెప్పులతో కొడితే సరిపోతుందా ?
చెరసాలలో పెడితే సరిపోతుందా?
సస్పెండ్ చేస్తే సరిపోతుందా ?
తమ సహచర ఉపాధ్యాయుడు ఇటువంటివాడా ?
అని తోటి ఉపాధ్యాయినులు అసహ్యించుకోరా ?
తమ సహచర ఉపాధ్యాయుడు ఇటువంటివాడా ?
అని తోటి ఉపాధ్యాయినులు అసహ్యించుకోరా ?
వాడి భార్య ఆ ఆడపిల్లల స్థానంలో
తన పిల్లలను ఊహిస్తే ఎలా స్పందిస్తుంది ?
తన భర్త అని చెప్పుకోవడానికి సిగ్గు పడదా ?
మా అన్న అని చెప్పుకోవడానికి
ఆ అక్కచెల్లెళ్ళు సిగ్గుపడరా ?
అతని కుటుంబ సభ్యులు నిజాయితీగా
ఆలోచిస్తే వారి ముందు నిలబడగలడా ?
నా కొడుకే అని చెప్పుకోవడానికి
ఆ తల్లి మనసు ఎంత క్షోభిస్తుందో కదా ?
వాడి నికృష్ట చేష్టలకు వాడిపోయిన ఆ ఆడపిల్లల్ని
చూసి వాడి తల్లి నిష్పక్షపాతంగా ఓ తల్లిలా నిలబడితే ,
వాడి కుత్తుక నరికే మొదటి వ్యక్తి వాడి తల్లి కాక మరెవరు ?
ఆ తల్లే " మదరిండియ" కాదా ?
తల్లీ !ఈ భూమి మీది బిడ్డలందరూ నీ బిడ్డలనే భావిస్తావు కదూ ?
*********
దొరికితే దొంగలు -దొరకకుండా
దొరల్లా మిగిలిన వారెంతమందో కదా ?
బయటకు చెప్పుకోకుండా ఉన్న
ఆడపిల్లల్లెంత మందో కదా ?
******
దొరికితే దొంగలు -దొరకకుండా
దొరల్లా మిగిలిన వారెంతమందో కదా ?
బయటకు చెప్పుకోకుండా ఉన్న
ఆడపిల్లల్లెంత మందో కదా ?
******
ReplyDeleteతల్లి, తండ్రి, అన్న, తాతయ్య, మామయ్య, బాబాయి .... ఇలా ఎవరు వెంట ఉన్నా ఆడపిల్లలను కాపాడుకోలేక పోతున్నారు ఎందుకు?
కౄర మానవమృగారణ్యంలో జీవిస్తున్నామా!? ప్రజాస్వామ్య సమాజం లో సంచరిస్తున్నామా?
ఎంచుకున్నదేమో ఉపాధ్యాయ వృత్తి కానీ పసుప్రవృత్తి .... ఎందుకు? ఎందుకిలా జరుగుతోంది?
"ఈ ప్రశ్నలకు బదులేది?
ఈ కవిత లో మానసిక సంఘర్షణే ప్రశ్నలుగా సమాజం ముందు పెట్టినట్లుంది. ఎన్నింటికో సమాధానాలు ఏ న్యాయస్థానాలూ చెప్పలేవు.
సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయాలివి
ఎందుకు చెప్పలేరు చంద్రగారు ?ఆ జడ్జిగారికి ఆడపిల్లలుండరా ?ఆ లాయర్లకు ఆడపిల్లలుండరా ?ప్రతి ఆడపిల్లలోనూ తన ఆడపిల్లను చూసే సంస్కృతి అలవరచుకోవాలి...చదువుకున్నవారిగా వారి కనీస ధర్మం నిర్వర్తించాలి ...లేకుంటే ఆ స్థాయికి చేరుకుని ప్రయోజనం ఏముంది?
Deleteఇలాటి ప్రశ్నలకు బదుళ్ళు ఉండవు శ్రీదేవి గారు.
ReplyDeleteఅసలివి ప్రశ్నలైతేగా!!
ఇవి తరతరాలుగా మృగమగాళ్ళలో పుట్టిన రాచపుండు వృత్తికీ ప్రవుత్తికీ ఏ నిష్పత్తీ కుదరని,
వయసుకీ వావి వరసకీ వ్యత్యాసమేరుగని పశు కాంక్షా వైపరీత్యం..
విలువా విద్యా విచక్షణా ఏ కోశానా తలకెక్కని వెర్రి తలపుల వికృతావస్థ...
అవునవును ఇవి ప్రశ్నలైతేగా ?ఇవి చచ్చిన కోడి ఈకలు ?(బ్రతికిన కోడి ఈకలైతే చెవిలో తిప్పుకోవచ్చుగా) ,వాడికి పుట్టిన రాచపుండు కూడ నిష్పత్తిలో దెబ్బతీసి వాడిని వాడి అవయవాలకు దూరంచేస్తుంది కదా ,పశువులు దేవుడు చెప్పిన విధానాన్నే అనుసరిస్తున్నాయి...కావున ఈ కామాంధుడిని పశువులతో పోల్చి వాటిని అవమానించవద్దు మనం ,విచక్షణ మరచిన ప్రతివాడిని పోలీసులు , కోర్టు అనకుండా సమాజమే కఠినమైన రీతిలో స్పందించి బుద్ధి చెప్పాలి జానీగారు.
Deleteఎందరు ఆడపిల్లలు నోరు విప్పటం లేదో.... అనాథల మాటేమిటి, ఆ అభాగ్య తల్లులను ఎవరాదుకుంటారో...
ReplyDeleteవార్తలు చూసి ఎక్కడో ఉన్నారులే అనిపించేది ఇదివరకు...కాని అన్నిచోట్లా మాటువేసి నక్కల్లా కాచుకు కూర్చున్నారనిపిస్తోంది ...ఓ సారీ ! నక్కలు చనిపోయిన తర్వాతే పీక్కు తింటాయి ...సో ...నక్కలే నయం.ఆడపిల్లల్ని కాపాడడానికి ఆ ఆదిదేవుడే రావాలేమో మీరజ్ .
Delete''ప్రేమించాలని విద్యార్థినిపై కత్తితో దాడి''
ReplyDelete''విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది''
''కళాశాలలోనే విద్యార్థినిపై దాడి''
''యువతిపై వేడినూనే పోసిన ఉన్మాదీ''
''కత్తిదూసిన ప్రేమోన్మాదం''
మొన్న శ్రీలక్ష్మీ, ప్రసన్న లక్ష్మీ.....నిన్న అయేషా మీరా,సమీరా,లావణ్య,మాధురి,నాగలక్ష్మీ.అనూష.
ఇవి రోజురోజుకు కళాశాలలో చదువుతున్న అమ్మాయిలపై ప్రేమోన్మాద దాడులు....
మరోవైపు
''ఆనాధ బాలికను చేరదీసి అత్యాచారం''
''కామంతో మతిస్థిమితం లేని సొంత చెల్లెలిపై అన్న అత్యాచారం''
''కన్న కూతురుపై కన్నెసిన కసాయి తండ్రి''
''కీచక టీచర్ విద్యార్థినిపై అత్యాచారం''
''పుటుపాత్పై నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్ళి సామూహిక అత్యాచారం''
''మూడు నెలలుగా మహిళపై ఖాకీల అత్యాచారం.''
ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో మూలన అమ్మాయిలపై, దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీడియా హడావిడి చేస్తుంది... ప్రభుత్వం చట్టాలు చేస్తుంది... పోలీసులు కౌన్సిలింగ్ చేస్తున్నారు... మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ధర్నాలు...రాస్తారోకోలు చేస్తున్నారు.... నాటి వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థిని అనురాధ నుండి నేటి ప్రణీత, అనుషల వరకు... నాటి ఆయేష మీరా నుండి నేటి సమీరా వరకు ఇలాంటీ సంఘటనలు ప్రతి రోజు ఏదో ఒక మూలన పునరావృతం అవుతూనే వున్నాయి. మళ్ళీ....మళ్ళీ తిరిగి ఇదే తంతూ. అసలు మానవ సంబంధాలు ఇంత హీనంగా ఎందుకు దిగజారుతున్నాయి? మనిషి పట్ల మనిషికి ఉండాల్సిన స్నేహబంధం స్పందన ఎందుకు కరువవుతుంది?. ఈ సంఘటనలు మళ్ళీ మళ్ళీ ఇలా సంభవించటానికి కారణం ఏమిటి? ఇందుకు నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులే కారణమా? లేక వ్యక్తులలోని మానసిక దౌర్బల్యం... మనసిక బలహీనతలే ఈ చర్యలకు కారణమా? అనేది పరిశీలించాలి.
3 సంవత్సరాలు పసి పిల్లల నుంచి 80 ఏళ్ల పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో అత్యాచారాలకు గురవుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికి నేడు జరుగుతున్న ఘటనలను చూస్తుంటే ఆందోళన కలుగుతుంది. తన రక్త మాంసాలతో కనిపెంచిన కన్న తండ్రి, అమ్మా నాన్నల తర్వాత రక్షణగా ఉండాల్సిన తొడబుట్టిన సోదరుడు, విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరులను తయారు చేసి అందించాల్సిన ఉపాధ్యాయుడు, రక్షణ కల్పించాల్సిన పోలీసులు అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతుంటే ఇక అమ్మాయిలకు ఈ సమాజంలో ఎక్కడ రక్షణ దొరుకుతుందనేది ప్రశ్నర్థాకంగా మారింది. రాష్ట్ర రాజధాని నగరం బోయిన్ పల్లిలో గత జూన్ నెలలో తండ్రిచేత అత్యాచారానికి గురికాబడిన బాలిక, కావలి పట్టణంలో సొంత అన్నచేత అత్యాచారానికి గురయిన అమ్మాయి, రక్షణ కల్పించాల్సిన పోలీసు వృత్తిలో వున్న సొంత అన్నచేత గత కొన్ని సంవత్సరాలుగా అత్యాచారానికి గురవుతున్న మతి స్థిమితం లేని మహాలక్ష్మీ, పిల్లలు లేరని కన్న కూతురుగా చూసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను ఈ అమ్మాయిలు ఏలా చూస్తారూ?. ఎలా అర్థం చేసుకుంటారూ?. ఈ సమాజాన్ని చూసి ఎంత భయాందోళనకు గురవుతారనేది అందోళన కలిగిస్తుంది. కన్న తండ్రులు, తొబుట్టువులు, పవిత్ర వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులే తోడేళ్లవుతుంటే.... కడుపులో పెట్టుకు కాపాడాల్సిన కన్నవారింట్లోనే రక్షణ కరువవుతుంటే ఇక అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సింది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది.
రాజుగారు నా బ్లాగుకు స్వాగతం . మీ సుదీర్ఘమైన విశ్లేషణాత్మకమైన వివరణ చాలా స్పష్టంగా ఉంది. అవే ఉప్పు కారాలు తింటున్నారుగా ఆడపిల్లలకు రావే ఉన్మాదాలు ?వాళ్ళని ప్రేమించని వాడిపై యాసిడ్ దాడి చేయరే?ఎంతమంది లేడీ టీచర్స్ మగపిల్లలకు పాఠాలు చెబుతున్నారు ,వారికి రావే మనోవికారాలు ?ఆఖరికి ఆడపిల్లకు కుటుంబంలోని తండ్రి ,అన్నదమ్ములు,బాబాయిలు....వీరి నుండి కూడా రక్షణ పోతే సమాజంలో ఇంకెక్కడికి వెళుతుంది? తనను తాను రక్షించుకోవడానికి?నా ఆలోచన తప్పయినా ఇప్పుడేమనిపిస్తుందంటే ఆడపిల్ల పుట్టగానే చంపేసిన ఆ తల్లులు ...ఆ ఆడపిల్లను ఈ నరకం నుండి కాపాడేశారేమో అని ,ఈ వార్త చూసినప్పటి నుండి మానసికమైన బాధతో ఈ విధమైన ఆలోచనలే సరయినవేమో అనిపిస్తోంది కాదని తెలిసినప్పటికి .
Deleteమొదటి తప్పుకు పడని శిక్ష ఎందరకు మార్గదర్శకమైందో. క్రూర ప్రవృత్తి కలిగిన ఈ మృగాలు విచారణకు పై కోర్టు కు అప్పీల్ చేసుకోవడానికి రాష్ట్రపతి క్షమాభిక్ష కు అర్హులా? శిక్ష పడడం లో జాప్యం మరిన్ని ఘోరాలకు తావిస్తోంది. ఆదపిల్లలని చిత్రవధ చేస్తున్న ఇలాటి వారికి విచారణ లేకుండానే శిక్ష వేయాలి
ReplyDeleteఅవునవును హరితా ,మదర్ థెరెసా...వివేకానంద ...లాంటి వాళ్ళ మార్గదర్శకాలు కనిపించవు,వినిపించవుగాని....ఇటువంటి నీచుడుకి శిక్ష పడకపోతే వెంటనే మార్గదర్శకమై పోతాడు మరెందరో నీచులకు.సిరి అంటుకోదుకదా,చీడ బానే అంటుకుంటుంది నీచులకు.చీడపట్టినది అది నాశనమైపోతే బాధలేదు,ఈలోపు ప్రక్కనున్న వాటికి కూడా అంటిస్తుందనేదే బాధ.
Deleteమీ వేదన సమర్ధించదగ్గదే. ఇందులో ఎటువంటి రెండో అభిప్రాయానికి తావు లేదు. కానీ..
ReplyDeleteఒక్క విషయం ఆలోచించండి. ఈ రోజుల్లో ఎన్ని బడులలో నిజంగా చదువు చెప్పడం వచ్చిన
ఉపాధ్యాయులున్నారు...? వాళ్లకు రాని చదువుని పిల్లలకు ఎలా చెప్తారు..? చిన్నప్పటి నుంచి
పనిపాట లేకుండా పెరిగి.. :"ఎలాగోలా" ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు అయిపోతున్నారు.
ఇలాంటి వాళ్లు ఏం పని చేస్తారు.. ఇలాంటి వాళ్లకు వచ్చే పనే ఇది. మనుషుల్లోనే కాదు శ్రీదేవీ గారు
వ్యవస్థలో రావాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. వ్యవస్థ మారితో మనుషులు తప్పనిసరి పరిస్థితుల్లో మారాల్సి వస్తుంది. ఇది నిజం. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైన.. అమ్మమ్మలు, తాతయ్యలను
వృద్ధాశ్రమాలకు తరిమేస్తున్నారు. పిల్లలకు మంచిచెడులు చెప్పేవారు. ఇప్పుడు కాదు.. మరో పదేళ్లు పోయాక చూడండి.. ఈ జెనరేషన్ లో సగం మంది పిల్లలు ఎంత చెత్తగా పెరుగుతారో.. వాళ్లేం అరాచకాలు చేస్తారో. పాఠశాలలు సభ్యత-సంస్కారం అనే పాఠ్యాంశాన్ని, వ్యక్తిత్వ వికాస పాఠాలను అర్జెంటుగా చేర్చాల్సిన అవసరం ఉంది.
సతీష్ గారు మీ స్పందనలకు ధన్యవాదములు.ముందు ఒక వ్యక్తిలో వచ్చిన మంచి మార్పే...ఒక కుటుంబాన్ని మారుస్తుంది,ఒక కుటుంబంలో వచ్చిన మార్పు ఒక సమాజాన్ని మార్చుతుంది,ఒక సమాజంలో వచ్చిన మార్పు ఒక కుగ్రామాన్ని మారుస్తుంది,...గ్రామాన్ని,ఊరిని,.....కాబట్టి ముందుగా వ్యక్తిలోనే మార్పురావాలి సతీష్ గారు.సభ్యత-సంస్కారం ,వ్యక్తిత్వ వికాసం ఇక ముందుతరాలకు అందని ద్రాక్షేనేమో ...అని నా అనుమానం ...కాదు..కాదు నమ్మకం.వాస్తవం చేదుగా వున్నా తప్పదు జీర్ణించుకోవాలి మనం .
Deleteభయం కలుగుతుంది ఈ సమాజం లో బతక డానికి .. ఎందరి కన్నీళ్లు మరుగున పడ్డాయో .. మరెందరు మౌనం గా నిష్క్రమించారో .. తెలీదు .. కాని ఏ కన్ను ఏ ద్రుష్టి తో చూస్తుందో .. ఇలా ఐతే ఆడపిల్లల సంఖ్య తగ్గటం లో ఆశ్చర్య మేముంది ?
ReplyDeleteరాధికగారు! నాకూ ఆడపిల్లల గూర్చి భయంగా ,ఆవేదనగా ,మానసిక ఆందోళనగా....చెప్పలేనంత వేదనాపూరితంగా ఉంది .ఈ అసమర్ధ సమాజం మీద అసహ్యంగానూ ఉంది.
Delete