Tricks and Tips
మిగిలితి నే నిశ్శబ్ధ నిశీధిలా .....
కడలి అంత కరుణ కోరి
ఏరి , కోరి నిన్ను చేరి
హృదయమంత నిన్ను దాచి
నీ రాకకై వేచి చూచి
వేదన తోడి వేసారి పోయి
ఆలోచనలు ఆవిరయ్యి
వేయి కళ్ళతో , వెక్కిళ్ళతో
ఇసుక తిన్నెల్లో , మసక వెన్నెల్లో
ఎదురుతెన్నెల్లో , హృది మంటల్లో
నీపై ఆశలు నివురై పోగా
మిగిలితి నే నిశ్శబ్ధ నిశీధిలా
*********
చాలా బాగుంది, ప్రతి లైనూ ఓ వేదనా కడలిలా ఎగసిపడింది,
ReplyDeleteచక్కని భావాలు పలికాయి కవితలో.
మీరజ్ మీ అభినందనలకు ధన్యవాదములు .
Deleteనీ రాకకై వేచి చూచి
ReplyDeleteవేదన తోడి వేసారి పోయి
ఆలోచనలు ఆవిరయ్యి....బాగుందండి
వేదనలు వేడిసెగలు రగిలించేసరికి ఆలోచనలు ఆవిరైపోవడం ....సర్వ సాధారణం . మీ అభినందనలకు ధన్యవాదములు పద్మగారు .
Delete
ReplyDeleteనీ రాకకై వేచి చూచి, వేదన తోడి వేసారి పోయి
ఆలోచనలు ఆవిరయ్యి ...................... హృది మంటల్లో
నీపై ఆశలు నివురై పోగా మిగిలితి నే నిశ్శబ్ధ నిశీధిలా
చాలా చాలా బాగా అవిష్కరించావు ..... భావనల్ని! అభినందనలు శ్రీదేవీ!
చంద్రగారు మీ అభినందనల అలలు నన్ను చేరుకున్నాయి , ధన్యవాదములు .
ReplyDelete