మా ఊరి సంతకొచ్చి ఓ సిన్నదానా ..
నా మనసూ దోసినావె ఓ సిన్నదానా ..
ఓ సిన్నదాన , సిన్నదాన , సిన్నాదానా
నా మనసూ దోసినావె ఓ సిన్నదానా ..ll మా ll
సుక్కలా రైక తొడిగి ఓ సిన్నదానా ..
సున్నాలున్న సీర కట్టి ఓ సిన్నదానా ..
సూరీని బొట్టు పెట్టి ఓ సిన్నదానా ..
సూదంటూ సూపుసూశావే ఓ సిన్నదానా ..
నా మనసూ దోసినావె ఓ సిన్నదానా ..ll మా ll
ముద్దబంతి పూలు పెట్టి ఓ సిన్నదానా ..
ముద్దుమోము సూపెట్టి ఓ సిన్నదానా ..
ముక్కుకూ ముక్కెరెట్టి ఓ సిన్నదానా ..
ముల్లల్లే గీసేశావే ఓ సిన్నదానా ..
నా మనసూ దోసినావె ఓ సిన్నదానా ..ll మా ll
తువ్వాయిల గెంతుతూ ఓ సిన్నదానా ..
తుల్లిపడి సూత్తూ ఓ సిన్నదానా ..
తూనీగల్లె ఎగురుతూ ఓ సిన్నదానా ..
తూరుపల్లె మెరిసిపోయావే ఓ సిన్నదానా ..
నా మనసూ దోసినావె ఓ సిన్నదానా ..ll మా ll
కళ్ళలోన కళ్ళు కలిపి ఓ సిన్నదానా ..
కమ్మనైన కలసూపి ఓ సిన్నదానా ..
కంకిలాగ తల ఊపావే ఓ సిన్నదానా ..
కనికరమే సూపినావే ఓ సిన్నదానా ..
నా మనసూ దోసినావె ఓ సిన్నదానా ..ll మా ll
************
మా ఊరి సంతకొచ్చి ....
ReplyDeleteసుక్కలా రైక తొడిగి, సున్నాలున్న సీర కట్టి, ముద్దబంతి పూలు పెట్టి, ముక్కుకూ ముక్కెరెట్టి,
కమ్మనైన కలసూపి .... నా మనసూ దోసినావె ఓ సిన్నదానా ....
ఎంత చక్కని జానపదమో
అభినందనలు శ్రీదేవీ!
చంద్రగారు మీ అభినందనాశీస్సులకు ధన్యవాదములు .
Deleteవామ్మో... ఎంకి పాటలు ఎక్కువయ్యాయి, అన్నీ ఓ చోట కూర్చి బాణీ కట్టి పాడేయాల్సిందే(నా స్వరం వినలేక పోతే అది మీ ఖర్మ)
ReplyDeleteదేవీ... సంక్రాంతికి ముందే పల్లె అందాలు కనిపిస్తున్నాయి తల్లీ.
పిల్లల్లోని అంతర్గత శక్తులు వెలికి తీయడం మన వృత్తి , మీలోని అంతర్గత శక్తులు వెలికి తీయడం నా బ్లాగు వృత్తి .సాధన చేస్తే సాధ్యం కానిదేముంది , బాగా సాధన చేయండి మన సినిమాలో గాయని మీరే మీరజ్ .
Deleteభలే ఉందండి.
ReplyDeleteలక్ష్మీదేవిగారు నా బ్లాగుకు స్వాగతం .మీ అభినందనలకు ధన్యవాదములు .
ReplyDelete