క్యారీ బ్యాగుల ఫ్యాక్టరీకి
లోనులు ఇస్తూ ,
వాటిని పట్టుకెళ్ళే వారికి
ఫైన్లు వేస్తారు ఎందుకో ..... ?
****
తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలు
పిల్లలపై రుద్ది ,
వారి జీవితాలతో
ఆటలాడతారు ఎందుకో .... ?
****
ప్రజల ఓట్లతో నెగ్గిన
రాజకీయ నాయకులు ,
ప్రజల బాధలు తీర్చడానికి
వెనుకడుగేస్తారు ఎందుకో .... ?
****
కన్నతల్లిదండ్రులను
కాలేజీకని మోసం చేస్తూ ,
తరగతి బయటి వ్యవహారాల్లో
చురుకుదనం ఎందుకో .... ?
*******
ఎందుకో... అర్దంకాదెందుకో..:-))
ReplyDeleteఅర్ధం కాక కాదు , అర్ధం కానట్లు నటించటం అది . అసమర్ధత వల్లే నటన . అందుకే .... అలా ... మీరజ్
Deleteక్యారీ బ్యాగుల ఫ్యాక్టరీలకి లోనులు, వాటిని పట్టుకెళ్ళే వారికి ఫైనులు
ReplyDeleteతమ ఇష్టాలు పిల్లలపై రుద్దే తల్లిదండ్రులు
ప్రజల బాధలు తీర్చని ప్రజల ఓట్లతో నెగ్గిన రాజకీయ నాయకులు,
కాలేజీకని కాలేజీకెళ్ళని కుర్రకారులు ....
అన్నీ అపసవ్యతలే .... ఎందుకో మరి?
ప్రశ్నలతో ఆలోచనల్ని రేకెత్తిస్తూ బాగుంది వచన కవిత
అభినందనలు శ్రీదేవీ!
నాలో రేగే ఎన్నో ప్రశ్నల్లో ఇవి కొన్ని . వీటి పరిష్కారం మన చేతిలో లేదే... అనే బాధలో పుట్టినది ఈ కవిత . మీ అభినందనలే నా మనో బలాన్ని పెంచుతున్నాయి చంద్రగారు .
Delete