మనసున నీ తలపులు ఉండగా
మల్లీ , మాలతి లతలేల,
జాజుల కదంబ మాలలేల !
కన్నుల నీ రూపం నిండగా
రమణీయ చిత్రములేల ,
ప్రకృతి సుందర దృశ్యములేల !
వీనుల నీ ఊసులు నిండగా
వీణా , వేణు నాదములేల ,
కోకిల కుహుకుహు రాగములేల !
పెదవులు నీ పేరే పలుకగా
చిరుదరహాసము చేయగనేల ,
చిలుక పలుకులు పలుకగనేల !
చిత్తము నీ చెంతను చేరగా
చిత్తరువల్లె నిలువగనేల ,
నా చిత్తము కొరకు వెదుకగనేల !
*********
v v nice
ReplyDeleteV.V. THANKS
Deleteదేవీ.., చాలారోజుల తర్వాత మంచి భావకవిత్వం రాశారు.
ReplyDeleteబాగుంది.
మీరజ్ మీ స్పందనలకు ధన్యవాదములు.
Delete