తరతరాల
అంతరాలను మరచి ,
స్థాయి , స్తోమత ,
స్థితిగతులను మరచి ,
హోదా , పాత్ర ,
అంతస్తులు మరచి ,
నా పాత్ర ప్రక్కన ,
నీ పాత్ర ఉంచిన ,
నాతో , నీవు సమమౌతావా ?
రంగు , రూపు
ఒక్కటే అయిన ,
నేనూ, నీవు ఒక్కటవుతామా ?
తరతరాలకు ,
ఈ అంతరాలను ,
తరగని గనిగా అందిస్తుంటే ,
మనుషుల నీడలో
బ్రతుకుతు కూడా ,
వారి జాడ్యం నేర్చుకోవా ?
*******
వద్దు, మనుష్యుల జాడ్యం , వాటిలో కూడా మలినాన్ని వెతికే మన నేచర్ వాటికి వద్దు,
ReplyDeleteదేవీ, మీ ఆలోచనా విదానం చాలా ఉన్నతంగా ఉంటుంది, చిన్న కవితలకే పరిమితం కాకుండా పెద్దగా రాయండి.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు మీరజ్ ,నాలోని భావాలు చిరు మొలకలే .
ReplyDeleteనా పాత్ర ప్రక్కన, నీ పాత్ర ఉంచినా, నాతో, నీవు సమమౌతావా? మనుషుల నీడలో బ్రతుకుతు కూడా, వారి జాడ్యం నేర్చుకోవా?
ReplyDeleteప్రతి జీవచరమూ సిగ్గుపడేలా మనిషి తన నైజం ప్రవర్తించడం .... మరీ శోచనీయం
అభినందనలు శ్రీదేవీ!
జీవులకు మంచి , చెడు తారతమ్యం తెలియదుకదా ,అందుకే ఇళ్ళలో పెంచుకుంటున్న అనేక జీవులు ప్రకృతికి విరుద్ధంగా మనుషుల్లా (అందరిని ఉద్దేశించి కాదు ) ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాయి ... అందుకే ఇలా రాశాను చంద్రాగారు . మీ అభినందనలకు ధన్యవాదములు .
Delete