నీ తలపులు
నా కన్నుల్లో కాంతి పుంజాలై వెలుగుతూ,
నా లేబుగ్గల్లో గులాబీలై
విరబూస్తూ ,
నా అరుణాధరాలపై ముసిముసి నవ్వులు చిందిస్తూ,
నా హృదయంలో వలపులై స్పందిస్తూ,
నను కలవరపరస్తున్నాయి సఖుడా ....... !
నా ఈ అనంతాన రాగాన్ని
ఆస్వాదిస్తూ ,
నా మనసు ఆలపించే
మౌనరాగాన్ని ఆలకిస్తూ ,
నా మనస్సుమాలను
వికసింపజేస్తూ ,
నా తలపుల తలుపులు
మూసివేస్తూ ,
నా వలపు వాకిట్లో
విరివానను
ఎప్పుడు కురిపిస్తావు ?
మూసివేస్తూ ,
నా వలపు వాకిట్లో
విరివానను
ఎప్పుడు కురిపిస్తావు ?
********
మీ తలపులు బాగున్నాయి.
ReplyDeleteనా తలపుల తలుపులు తెరచి వీక్షించినందుకు ధన్యవాదములు పద్మార్పితగారు.
ReplyDeleteనీ తలపులు కాంతి పుంజాలు, నా లేబుగ్గల్లో గులాబీల ముసిముసి నవ్వులు సఖుడా ....!
ReplyDeleteఈ మౌనరాగాలాపన నీ కోసమే .... వలపు వాకిట్లో విరివాన కురిపిస్తావనే ....!
చక్కని స్పష్టత భావనల్లో
బాగుంది నీ తలపులు కవిత
అభినందనలు శ్రీదేవీ!
చంద్రగారు మీ అలయని అభినందనలే నా కవితాలోచనకు సాధనలవుతున్నాయి .
Delete"తలలు బోడులైన తలపులు బోడులగునా.".. అన్నారో కవి గారు,
ReplyDeleteకానీ ఇక్కడ అందమైన తలపులన్నీ తలుపులు తెరుచుకొని గగనాననికి ఎగిరివెళ్తున్నాయి.
మేము మా వంతు పట్టేసుకున్నామనుకో..
మీఅభినందనలు చదివినప్పుడల్లా ముఖం మీద చెరగని చిరునవ్వు చోటుచేసుకుంటుంది.ఆ తలపుల గాలిపటాలకు అంతులేనన్ని దారాలు కట్టాను,ఎవరికెన్నికావాలంటే అన్నిపట్టుకోవచ్చు,కాకపోతే తలుపులు తెరచి ఉంచండి మీరజ్ .
Delete