Tricks and Tips

Thursday, December 5, 2013

అన్నీ నాకు తెలుసమ్మా ...... !



నను జో .. జో .. కొడుతూ మా అమ్మ ,
జోలపాట పాడింది . 
నే నిద్దురపోయాననుకుంటూ ,
మెల్లగ లేచి వెళ్తుంది .

తాతయ్యను చూసి నవ్వుతూ ,
నా ముచ్చట్లన్నీ చెప్తుంది . 
అమ్మమ్మను చూసి ఆనందంగా ,
నా అల్లర్లన్నీ చెప్తుంది .

మామయ్యతో మాట్లాడుతూ ,
నా పోలికలన్నీ చెప్తుంది . 
నాన్న వస్తే ఎదురెళ్ళి ,
నాకు బొమ్మలు తెమ్మని చెప్తుంది .

పిన్నిని రమ్మని పిలిచేస్తూ ,
నా నవ్వుల గూర్చి చెప్తుంది .
పక్కింటి వారిని పలకరిస్తూ ,
నా పనులు ఎన్నో చేస్తుంది .

మధ్య ,మధ్య నా వద్దకు వచ్చి ,
కదిలానేమో అని చూస్తుంది . 
కప్పిన దుప్పటి సరిచేసి ,
మళ్ళీ జో .. జో .. అంటుంది .

నీ కోసం అమ్మా .. అమ్మా .. 
నే రెప్పలు ఊరికే మూసాను,
నిద్దుర అసలే పోలేదు ,
అన్నీ నాకు తెలుసమ్మా ,
అందుకే నేను నవ్వుతున్నా... !

********

4 comments:

  1. అమ్మ మనస్సు తెలిసిన బిజ్జి కన్నా,
    అందుకే అమ్మ అవుతుంది అందరికన్నా మిన్న,
    ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించిది ఈ కవిత చదివితే (చాలాకాలం తర్వాత)

    ReplyDelete
    Replies
    1. నా ఈ చిన్న కవిత ద్వారా మీకంత ప్రశాంతత కలిగించగలిగినందుకు సంతోషంగా ఉంది మీరజ్.ధన్యవాదములు.

      Delete
  2. నను జో .. జో .. కొడుతూ మా అమ్మ ,
    జోలపాట పాడింది .
    నే నిద్దురపోయాననుకుంటూ, మెల్లగ లేచి వెళ్తుంది .

    నాకు అన్నీ తెలుసమ్మా ...... !

    ఊహ తెలియని పసి మనసు ఆలోచనల్లో .... ఉత్సాహాన్ని అమాయకత్వాన్నీ ఆవిష్కరించిన పద్దతి బాగుంది.
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు నిత్యనూతనంగా అభినందించడం మీకే సాధ్యం.ధన్యవాదములు.

      Delete