Tricks and Tips

Friday, December 27, 2013

మధుర భావ వీచికలే.........


పలికెను నాకు స్వాగతము ,
నే పరవశమైతి క్షణక్షణమూ ,

ఆశలే మల్లెలై విరియగా ,
హృదయమే  కోకిలై పాడగా ,
 
సింధూరమే నేనవ్వనా - అందాల నీ నుదిటిపై ,
సిరిమల్లెనె నేనవ్వనా - నీ నీలిముంగురులలో,
 
అంతరంగం అల్లేనే ,
ఆలోచనలా పొదరిల్లు . 
 
మెరుపును నేనవ్వనా - నల్లని నీ కళ్ళలో ,
చిరునవ్వు నేనవ్వనా - పూలేత నీ మోవిపై ,
 
కొంటె తుమ్మెదలా కనులు ,
మన్మధ చాపాలా నొసలు . 
 
తారక నేనవ్వనా - నీ చిన్ని నాసికపై ,
భావాన్ని నేనవ్వనా - తీయని నీ మాటలో ,

భావమెంతొ మధురములే ,
కోటి వీణల సరిగమలే .

పయ్యెద నేనవ్వనా - వయ్యారి నీ మేనిపై ,
గీతను నేనవ్వనా - పిడికిటి నీ నడుముపై ,

మదిని నిండే కోరికలే ,
మధుర భావ వీచికలే . 

గాజులు నేనవ్వనా - నీ కరకమలాలపై ,
అందెలు నేనవ్వనా - నీ పాదపద్మాలపై ,

నిండు పున్నమి రాతిరులు ,
నిదురను దోచే స్వప్నాలు . 

*******
 
 
 



10 comments:

  1. chakkani chukka, ame andanni dviguneekrutham chesthunna mee bhaava veechikalu rendu adbhutham

    ReplyDelete
    Replies
    1. అద్భుతాలకు అంతెక్కడుంది..........అందులో ఇదో బిందువు . హరితా మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  2. "సింధూరమును, అందాల ఆ నుదిటిపై సిరిమల్లెను ....
    మెరుపును నల్లని ఆ కళ్ళలో, చిరునవ్వును ....
    తారకను ఆ చిన్ని నాసికపై, భావనను ....
    పయ్యెదను వయ్యారి ఆ మేనిపై, గీతను ....
    గాజులును ఆ కరకమలాలపై, అందెలును .... నేనవ్వనా" అంటూ
    మధుర భావ వీచికలు సుతారంగా మనసుల్ని తాకుతూ .... ఎంత చక్కని భావనల విరుపులో అవి
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
  3. మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.

    ReplyDelete
  4. బాగుంది మీ భావవీచిక

    ReplyDelete
    Replies
    1. నా భావ వీచికలు మిమ్ము స్పందింప చేసినందుకు సంతోషమండి .

      Delete
  5. మనకు(నా కలానికి) భావ వీచికలు తగలవు, భగ,భగ వీచికలు తప్ప.:-))

    ReplyDelete
    Replies
    1. ఈ సంవత్సరాంతమున మీ కోసం , నా కలానికీ కొంచెం నా చేతనైనంత వరకూ... వాస్తవ సెగ రగిలిస్తా మీరజ్.మీ వాస్తవ అభిప్రాయ వ్యక్తీకరణకు అభినందనలు.

      Delete
    2. మీ రచనల్లో, వ్యాఖ్యల్లో వాస్తవం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
      మీకు కొన్ని నిర్దిష్ట మైన అభిప్రాయాలు ఉన్నాయి. నిష్పక్షపాత ధోరణీ ఉంది.
      ఇతరులలోని గొప్పను గ్రహించే గొప్ప హృదయమూ ఉంది.
      ( అఫ్కొర్స్ నాకూ ఉన్నాయిలే ఇవన్నీ :-))

      Delete
    3. మీ అభినందనలకు ధన్యవాదములు మీరజ్ . ఏదేమైనా నా చేతిలో ఉన్న కలం చాలా చిన్నదీ , లేపాక్షి వారి షోరూంలో కొన్నది , అందుకే అలా రాస్తుందనుకుంటా మీరజ్ .
      ఇప్పుడే బయలుదేరెళ్ళి రోడ్డు మీది కలం కొంటానుండండి .

      Delete