Tricks and Tips

Wednesday, December 11, 2013

అమ్మో ! నేను పెరగను .........



( నా చిట్టి తండ్రీ ! నీవెప్పుడు పెద్దవాడవుతావమ్మా ... ?
అని తల్లి ముద్దులాడుతుంటే ... )

అమ్మో ! నేను పెరగను ,
పెరగను కాక పెరగను . 

అన్నని చూసి నాకిపుడు ,
అన్నీ తెలిసి పోయాయి . 

బ్యాగ్ చేతికి ఇస్తావు ,
బడికి వెళ్ళమంటావు . 

A,B,C,D అంటావు ,
రాయిస్తూనే ఉంటావు . 

అ ,ఆ ,ఇ ,ఈ  అంటావు ,
చెప్పిస్తూనే ఉంటావు . 

1,2,3 అంటూ ,
చదివిస్తూనే ఉంటావు . 

అలసి ,సొలసి నాకు నేనే ,
పక్కకు ఒరిగి పడుకుంటాను . 

జో ... జో ... కొడతం మానేస్తావు ,
పొద్దున్నే నన్నూ లేపేస్తావు . 

ఆటలు , పాటలు ఆపెయ్యమంటావ్ ,
అల్లరి చేస్తే హాస్టల్ అంటావ్  . 

అమ్మో ! నేనూ పెరగను ,
అన్నలాగా పెద్దవను . 

******

10 comments:

  1. అస్సలు బడికే ఒద్దమ్మా...పెద్దయ్యాక ఎంచక్కా గోవుల గోపన్న అవుదువుగాని సరేనా...:-))

    ReplyDelete
    Replies
    1. పాపం వాడి ఉద్దేశ్యం అదికాదమ్మా ! ఎంచక్కా అమ్మ ఒడిలో ఉందామని ,అంతే .. మరే ఇతర ఉద్దేశ్యం లేదు . వాడు చాలా మంచివాడు మీరజ్ మన గూగులోడే .

      Delete
  2. గూగులోడైతే.. గోపాల క్రిష్ణుడే...(అక్కడంతా గోపికలే)

    ReplyDelete
    Replies
    1. అవునా ! గోపికల గోపయ్య అయ్యేకంటే , గోవుల గోపన్న అయితేనే నయమేమో మీరజ్ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను .

      Delete
  3. yedagadaanikendukuraa thondara....... ee pata bhaavaanni annanu chusthu bagane jeernam chesukunnatlunnadu yedi yemainaa nuvvu hayigaa bajjoraa kannaa jo..jo.....

    ReplyDelete
    Replies
    1. బొజ్జొని ,బొజ్జొని వీడు మబ్బులా ఉండి ,వాళ్ళన్న మెరుపులా అవుతాడేమో హరితా . ఏదేమైనా పెరిగాక బడికి పంపేద్దాం.

      Delete
  4. అ ,ఆ ,ఇ ,ఈ అంటావు , చెప్పిస్తూనే ఉంటావు .

    ఇంకా బిడ్డలకు అ..ఆ..ఇ..ఈ.. అంటూ చెప్పే తల్లులు కూడా ఉన్నారా? మీ రేదో సరదాగా కవిత్వధోరణిలో వ్రాసారేమో అనుకుంటాను. నిజంగా అలా అ..ఆ.. లు చెప్పే తల్లులుంటే వారికి అనేక వందనాలు.

    ReplyDelete
    Replies
    1. సార్ ! నా బ్లాగ్ కి స్వాగతం .మీ ఆవేదనను అర్ధం చేసుకున్నాను . ఇంకా మన వంటి తెలుగు భాషాభిమానులు ఉన్నారు కదా ,అమెరికాలో కూడా పాడుతా తీయగా ప్రోగ్రాం లో కోకిలల్లె పాడుతున్నారు కదా ,అందుకే రాశాను .

      Delete

  5. అమ్మో ! నేను పెరగను, పెరగను కాక పెరగను. అన్నని లా పెరగాలని లేదు. A,B,C,D లు, అ ,ఆ ,ఇ ,ఈ లు, 1,2,3 లు ఇష్టం లేదు. అలసి, సొలసిన నాకు జో .... జో .... కొడతం మానేస్తావేమో అని, ఆటలు, పాటలు ఆపెయ్యమంటావేమో అని, అమ్మో ! నేనూ పెరగను, అన్నలాగా పెద్దవను.
    పసి మనసు పసి భావనల్ని చాలా బాగా రాసావు. అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. పసి వయసు భావాలు చాలా బాగుంటాయి . పెద్దయ్యాక ఎలాగూ అంత అందంగా ఉండవుగా .అందుకే అలా రాసాను చంద్రగారు. మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete