Tricks and Tips

Thursday, December 26, 2013

మనువాడ వచ్చినానే ఓ పిల్లా !



మనువాడ వచ్చినానే ఓ పిల్లా !
నిను మనువాడ వచ్చినానే ఓ పిల్లా !
మనువాడ వచ్చినానే ఓ పిల్లా !
నిను మనువాడ వచ్చినానే ఓ పిల్లా ! 

ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
నిను ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
నిను ఏమి సూసి సేసుకోనురో ఓ బావా !  

మాగాణి సేనుంది ,గాదెలన్ని నింపుతాది  
ఎకరాల తోటుంది ,బంగారం దింపుతాది 
ఆ.....ఆ ...... ఆగాగు ...... 
వాన ,వరద వస్తాది ,సేనంతా మునుగుతాది 
పేనుబంక సోకుతాది ,తోటంతా సివుకుతాది 
ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
నిను ఏమి సూసి సేసుకోనురో ఓ బావా !  

ఒంటి నిండ సత్తువుంది ,కట్టపడే ఓపికుంది 
ఆలి ,బిడ్డల సూసుకునే అండ దండ నాకుంది 
ఆ .... ఆ .... ఆగాగు 
పొలం పనుల కాలమెంత ,ఆరు నెలలు ఉంటాది 
ఆపైని కాలమంత సిల్లరగా తిరుగు తుంటవు 
ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
నిను ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 

ఆరడుగుల ఎత్తు సూడు ,బిరుసైన కండ సూడు 
సక్కనైన మొహం సూడు ,కోరమీసకట్టు సూడు 
నన్నుమించినోడు ఈ ఊరివాడలోన లేడు సూడు  
మూడుముల్లు ఎసేత్తానే ఓ పిల్లా !

ఎందుకంత మీసకట్టు ,పౌరుషాలు కట్టిపెట్టు 
ఊరెలదమంటే నేను, బస్సు పేరు సదవలేవు 
ఉత్తరంముక్కసూసి బిక్కమొగం ఏస్తావు 
సంతకం సేయమంటే బొటనేలు సూపుతావ్
ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
నిను ఏమి సూసి సేసుకోనురో ఓ బావా !  

సదువుకోని వాడెవడూ, సక్కగాను బతకలేడా 
ఈ వయసులోనా సదువుతోటి పని ఏంటి ?
మాటలింక కట్టిపెట్టవే ఓ పిల్లా !
మంకుతనం ఇడిసిపెట్టవే ఓ పిల్లా !
 
సదువుకోని నీకు సిల్లుకాని ఇలువ లేదు 
సదువురానోల్ల బతుకు, ముల్ల మీద సీర కాదా 
పేకముక్క ఇడిసిపెట్టు ,పలకబలపం సేతపట్టు 
ఊరు,వాడ గొప్పతనం సదువుతోటే పెరుగుతాది
 సదువు విలువ తెలుసుకుంటే ఓ బావా !
మనువాడ నే సిద్ధము ఓ బావా !

   సదువు విలువ తెలుసుకుంటనే ఓపిల్లా !
 మనువాడ నే సిద్ధము ఓ బావా !
సదువు విలువ తెలుసుకుంటనే ఓపిల్లా !
 మనువాడ నే సిద్ధము ఓ బావా !

***********
 

8 comments:

  1. మనువాడ వచ్చినానే ఓ పిల్లా! నిను మనువాడ వచ్చినానే ఓ పిల్లా!
    ఏమి సూసి సేసుకోనురో ఓ బావా! నిను ఏమి సూసి సేసుకోనురో ఓ బావా!
    మాగాణి సేనుంది, ఎకరాల తోటుంది. ఒంటి నిండ సత్తువుంది, ఆలి, బిడ్డల సూసుకునే అండ దండ నాకుంది. సదువు విలువ తెలుసుకుంటనే ఓ పిల్లా!
    చక్కని జానపదం అరమరికలు లేని బాసలు ఎంత హృద్యమంగా ఉందో ....
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. నా జానపదాన్ని మెచ్చుకున్నందుకు ధన్యవాదములు చంద్రగారు .

      Delete
  2. దేవీ...మీ బావనిస్తవా..:-))
    పాపం అమాయకంగా,స్వచ్చంగా ఉండే బావని ఎన్నితిప్పలు పెట్టిందో ఆ కొంటే పిల్ల.
    చాలా,చాలా,బాగుంది.

    ReplyDelete
    Replies
    1. నా బావను మనువాడేశా మీరజ్ .ఎవ్వరికీ ఇవ్వను . అమాయకంగా నటిస్తారు కానీ నిజానికి వాళ్ళు అమాయకులు కారు మీరజ్ .

      Delete
    2. నిజమే కదా, దేవీ మీలో సున్నితమూ, పసితనమూ ఉన్నాయి, నాకు అవి బాగా నచ్చుతాయి.

      Delete
  3. చక్కని జానపద గీతంలా సాగింది మీకవిత

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలకు ధన్యవాదములు పద్మార్పితగారు.

      Delete