Tricks and Tips

Wednesday, December 4, 2013

ఆ తామరాకు మనసుపై ......


తమలపాకు చేతిలో 
గోరింట పూసిందా ?
 
రావి ఆకు రెప్పల్లో 
కలువలే  పూసాయా ?

సంపెంగ నాసికపై 
సన్నజాజి మెరిసిందా ?

పూలేత బుగ్గల్లో 
గులాబీలు పూసాయా ?

చిగురాకు మోవిపై 
విరజాజులే విరిసాయా ?
 
లతాంగి  తనువంతా 
మరుమల్లెలే కురిసాయా ?
 
ఆ తామరాకు మనసుపై 
ఎన్ని నీటి బొట్లు జారాయో !

*********


2 comments:

  1. akulannee amekichchi chetlu aanandamgaa modulainatlunnaayi. aakula gurinchi biological science vaalle baagaa cheppagalaru mari...:-)

    ReplyDelete
  2. If so, every Bio. Sci. student should be a poet. Anyway thank you.

    ReplyDelete