Tricks and Tips

Tuesday, December 24, 2013

ప్రయాసపడి భారమును మోసెడి...



పల్లవి :
 ఎవరూ లేక ఒంటరినై అందరికి నేను దూరమై 
అనాధగా నిలిచాను రావా !ఏసయ్యా 
నీవు రావా ఏసయ్యా !
నేను నీడలా నీ వెంట ఉండగా 
నీవు అనాధ ఎలా అవుతావు ?
నీవు దూరం ఎలా అవుతావు ?

చరణం :
స్నేహితులను నమ్మాను , మోసం చేశారు  ,
బంధువులను నమ్మాను , ద్రోహం చేశారు ,
దీనుడనై , అంధుడనై అనాధగా నిలిచాను ..
రావా ఏసయ్యా ! నీవు రావాలేసయ్యా !

నీ కళ్ళల్లో వెలుగునై నే నిండి ఉండగా 
అంధుడవు ఎలా అవుతావు ?
స్నేహితుల్లో , బంధువుల్లో ప్రేమగా 
నన్ను చూడు .... వాస్తవాలను గ్రహించు 
నీ విశ్వాసమును విశ్వసించు . 

చరణం :
నేనున్నా ,నేనున్నా అని అందరు అంటారు ,
కష్టాల్లో ,బాధల్లో తొలగి పోతారు .....
దీనుడనై , అంధుడనై అనాధగా నిలిచాను 
రావా ఏసయ్యా ! నీవు రావాలేసయ్యా !
ప్రయాసపడి భారమును మోసెడి నేను నీ చెంత 
ఉండగా నీవు దీనుడవు ఎలా అవుతావు ?
సుఖాల్లో అందరినీ మరచిన నీవు ,
కష్టాల్లో ,బాధల్లో వారి దరిచేర తలచెదవా ?

చరణం :
చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి ,
శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి ,
దీనుడనై , అంధుడనై అనాధగా నిలిచాను . 
రావా ఏసయ్యా ! నీవు రావాలేసయ్యా !
ఓ ! విశ్వాసి , నీ విశ్వాసాన్ని సడలించకు 
నీ పుణ్యమును పెంచుటకయినా ,
నీ పాపమును కరిగించుటకయినా ,
నీ పట్ల నా ప్రేమ కలకాలం కరుగదు . 

******

          బ్లాగ్ మిత్రులకు క్రిష్టమస్ శుభాకాంక్షలు 
******

2 comments:

  1. ee songni vinalante ekkadundo cheppandi plz

    ReplyDelete
    Replies
    1. నిజానికి నేనీ పాటను ఒక్కసారే దూరం నుంచి విన్నాను . నా మనసుకు నచ్చి అలా రాసాను . మీకు నచ్చినందుకు ధన్యవాదములు . కాని కృష్ణా గారు ఆ పాట ఎక్కడ లభిస్తుందో చెప్పలేను .

      Delete