యెన్నెలా యెన్నెలాలొ, యెన్నెలాయెన్నెలాలొ
యెన్నెలొచ్చె , యెన్నెలొచ్చె ఎన్నాల్లకో మా బతుకునా పున్నమొచ్చె ఎన్నేల్లకో llయె ll
ఎదురుగా ఉన్నదయ్య యెన్నెలొయెన్నెలా
పుడమి తల్లికేసి సూడు యెన్నెలొయెన్నెలా
బంగారం పండించు యెన్నెలా ....
భాగ్గాలు కురిపించు యెన్నెలా .... ll యె ll
రకతమంత సెమటసేసి యెన్నెలొయెన్నెలా
కట్టపడర రైతన్నా యెన్నెలొయెన్నెలా
పెజలందరి కడుపు నింపు యెన్నెలా
జనమభూమి ఋణము తీర్సు యెన్నెలా ll యె ll
బంజరంత బాగుసేసి యెన్నెలొయెన్నెలా
నాగలేసి సేను దున్ను యెన్నెలొయెన్నెలా
ఏరువాక పున్నమొచ్చె యెన్నెలా
కట్టమంత తీర్సునయ్య యెన్నెలా ll యె ll
నారు పోసి నీరు పెట్టి యెన్నెలొయెన్నెలా
కంటి రెప్పలాగ సూడు యెన్నెలొయెన్నెలా
కుప్ప నూర్సి బండికెత్తు యెన్నెలా
నట్టింట లచ్చిమొచ్చె యెన్నెలా ll యె ll
**************
yennelantha andamgaa undi paata ammayi kuda
ReplyDeleteyennullo raasaanamdi amdukenemo..........
ReplyDelete