విద్యావంతులు అందరు
కలసి అజ్ఞానంతో ,
అక్షర జ్ఞానం లేని వాళ్లకు
ఒటేస్తారు ఎందుకో .....?
*****
చిన్నచిన్న ఉద్యోగాలకు
డిగ్రీలు అడుగుతూ ఉంటే ,
ఎలక్షన్లలో పోటీకి చదువుతో
పనిలేదు ఎందుకో .....?
*****
ఒక్కరోజు ముందు పుట్టినా
పోటీ పరీక్షకు అనర్హుడంటూ ,
వయసు మళ్ళిన వారిని తెచ్చి
మంత్రులను చేస్తారు ఎందుకో ....?
*******
ఔను ఎందుకు? మనకెందుకని ప్రశ్నించుకుంటూ విజ్ఞులు తప్పించుకు తిరుగుతుంటారు. సామాన్యుడ్ని మాత్రం గొర్రెలతో పోల్చడం .... అన్యాయమేమో?
ReplyDeleteబాగుంది ప్రశ్న శ్రీదేవి!
చంద్రగారు శుభోదయం.మీ అభినందనలకు ధన్యవాదములు.
Deleteఎందుకో తెలీకపో్తే ఎలా తల్ల్లీ... మంత్రుల దగ్గర విటమిన్. ఎం. ఉంటుంది.
ReplyDeleteఅర్దంచేసుకోరూ...:-))
ఆకలేస్తే రెండు ముద్దలు అన్నం తింటాం కానీ బంగారు కణికలు తినలేం కదా... ఈ మాత్రం కూడా తెలియదా ? మానసిక పరిపక్వత లేని మానసిక వైకల్యంతో బాధపడుతున్నారా , ఇంకొంచెం ఎదగాలి మీరజ్ నేనింకా ........
Deleteమీ ఎదుగుదల శ్రేష్టమైనదే... డియర్ కోపం వచ్చిందా ఏంటి?
ReplyDeleteనేను బంగారు కణికలు , మానసిక వైకల్యం అన్నది రాజకీయ నాయకుల గూర్చి మీరజ్ .
ReplyDelete