నవనీతమును దోచిన వాడు ,
నారీమణుల మానస చోరుడు ,
నిరతము మనలను కాచేవాడు ,
నీలిమేఘశ్యాముడు వాడు ,
నుతించవలసిన దేవుడు వాడు ,
నూరు తప్పులను కాచిన వాడు ,
నృపులకే నృపతిగా నిలచిన వాడు ,
నెమలి పింఛం ధరించు వాడు ,
నేస్తం అటుకులు తిన్నవాడు ,
నైజం ఎరిగి మసిలినవాడు ,
నొప్పి , బాధను మాపేవాడు ,
నోటిలో భువనాలు చూపినవాడు ,
నౌకను నడిపే నాయకుడతడు ,
నందుని ఇంట పెరిగిన వాడు ,
నందగోపాలుడు కాక ఎవరూ ...?
******
నల్లనివాడు, నెమలి పింఛము వాడు, నోటిలో భువనాలు చూపినవాడు, నారీమణుల మనసు దోచిన వాడు,
ReplyDeleteనీలిమేఘశ్యాముడు, నూరు తప్పులను కాచిన వాడు, నందుని ఇంట పెరిగిన వాడు ,
నందగోపాలుడు కాక ఎవరూ ....?
ఔను! అతను నందగోపాలుడే! మానసచోరుడే!!
చాలా అందంగా రాసారు శ్రీకృష్ణుడి గురించి.
అభినందనలు శ్రీదేవీ!
కృష్ణున్నిమించిన చిలిపివాడు,ధీరుడు , గురువు , దైవం .....ఎవరున్నారు ?చంద్ర సర్... అందుకే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం . మీ అభినందనలకు ధన్యవాదములు.
ReplyDeleteవావ్, అందుకే అయ్యాడు సర్వాంతర్యామి.
ReplyDeleteబాగుంది దేవీ.
మనల్నందరినీ చూస్తున్నాడు....మీరజ్, ఏం కవితలు రాస్తున్నామా అని.
Deleteదేవీ,అయితే మన విన్నపాలు వింటాడు,నిత్యం సామాజిక రుగ్మతులను రూపుమాపమని అడుగుతున్నాం కదా, వేచి చూద్దాం.
Deleteఖచ్చితంగా,కాకపోతే దేనికయినా సమయం రావాలి మీరజ్,దేవుడు చేయలేనిది లేదు మనం స్వచ్చంగా కోరుకోవాలేగానీ......
Delete