మరదలు పిల్ల మరకతమైతే ,
మాటిమాటికి మాలిమి ఐతే ,
మిసమిసలాడుతూ మిడిసిపడితే ,
మీరు.. మీరని మీసం లాగితే ,
ముద్దు మురిపెం చూపెడితే ,
మూగ సైగగా మూతిని తిప్పితే ,
మృదువుగ మదిలో మృదంగం మోగగా ,
మెరుపులా మదిలో మెదులుతు ఉంటే ,
మేనరికం కోసం మేనత్త నడిగితే ,
మైమరపించే మైపూతలా ,
మొలకెత్తించినది మొగ్గల ఆశని ,
మోకరించిన నన్ను చూసి మోదంతో తల ఊపింది .
మౌనిగ ఉండే నన్ను వీడి మౌనం పారిపోయింది ,
మంచి రోజు రాగానే మంగళవాద్యం మోగింది .
*********
'మ' గుణింతం మరదలు మేనత్త కొడుకును మొత్తంగా మైకం లో ముంచేసిందన్నమాట. బాగుంది మీ మరదలు పిల్ల గడుసుతనం
ReplyDeleteఆ మాత్రం గడుసుతనం లేక ఆ మేనబావలు మబ్బుల్లా ఉండిపోతారేమో హరితా . మీఅభినందనలకు ధన్యవాదములు .
Deleteమంచి పిల్ల మా మరదలు పిల్ల్ల.
ReplyDeleteమొత్తానికి మమ్మల్ని తనవైపు లాక్కుంది,
దేవీ బాగుంది కవిత సరదాగా,
మొత్తానికి మరదలు పిల్ల తెలివైనదే ,బావనే కాదు మిమ్మల్ని కూడా తన వైపు లాక్కుంది. మీ అభినందనలకు సంతోషం మీరజ్ .
Deleteమరదలు పిల్ల మరకతమైతే, ముద్దు మురిపెం చూపెడితే, మూగ సైగగా మూతిని తిప్పితే, మోకరించిన నన్ను చూసి మోదంతో తల ఊపితే
ReplyDeleteమౌనిగ ఉండే నన్ను వీడి మౌనం పారిపోయింది, మంచి రోజు రాగానే మంగళవాద్యం మోగింది.
ఒకప్పటి రోజులు గుర్తుకు తెస్తూ పల్లె పరికిణీలో మరదలు పిల్ల ....
బాగుంది శ్రీదేవీ!
చంద్రగారు మీ అభినందనలకు ధన్యవాదములు .
Deleteoka mardalu nu mena mama pelli chesukovacha
ReplyDeleteఖన్నాగారు....నా బ్లాగ్ కు స్వాగతం.....మేనత్త కూతురిని పెళ్ళి చేసుకోవడం గూర్చి రాసాను.....అందులో తప్పేమీ లేదు , గమనించగలరు .
Delete