సహజ సంపద ప్రకృతి ,
అసహజ సాధన వికృతి .
ఆద్యంతమైన ప్రకృతి ,
అంతం చేసే వికృతి .
పచ్చని వరముల ప్రకృతి ,
శాపకాలుష్యమిచ్చే వికృతి .
పరవశ దృశ్యాల ప్రకృతి ,
వినాశం చేసే వికృతి .
చిరుదరహాసం ప్రకృతి ,
వికటాట్టహాసం వికృతి .
ప్రశాంత జీవనం ప్రకృతి ,
అశాంతి జీవనం వికృతి .
వదిలేయొద్దు ప్రకృతిని ,
విలువివ్వద్దు వికృతికి .
*******
nice
ReplyDeleteWelcome to my blog and thank you very much SARADAAJI .
ReplyDeleteఆది అంతం, పచ్చని వరం, చిరుదరహాసం, సహజ సంపద ప్రకృతి, .... అశాంతి, వినాశనం, శాపకాలుష్యం అసహజ సాధన వికృతి.
ReplyDeleteగొప్ప విశ్లేషణాత్మక కవిత
చాలా బాగుంది.
అభినందనలు శ్రీదేవి గాజుల!
అంత అందమైన ప్రకృతిని చూస్తూ కనులు మూసుకుని ఆస్వాదిస్తుం టే , మనసు పరవశిస్తూ , కలం కలవరిస్తూ , భావం పులకరిస్తూ అలాఅలా రాసుకుంటూ పోయింది నా ప్రమేయం లేకుండా . మీ అభినందనలకు సంతోషిస్తున్నాను చంద్రగారు .
Delete