దయార్ధ్ర హృదయిని ,
దాతృత్వదాయిని
దివ్య ఔషధము నీ ఆకాంక్ష .
దీన రక్షణకై అంకితమై ,
దురవస్థలెన్నో ఓర్చినా ,
దూరాలోచనతో కూడిన నీ
దృక్పధములే నీ జీవిత
దెసను మార్చివేసి , పరిపూర్ణతకై
దేవుని వైపు మనసును మరల్చగా ,
దైవ సాన్నిధ్యం దీనుల సేవలోనే
దొరికిందంటూ అమూల్యమైనది ,
దోచుకొచ్చిన ఆ పుణ్యాన్ని తిరిగి
దౌర్భల్యులకీయడం నీ ఆదర్శం .
దంభం అన్నది ఎరుగని నీకు
తుల్యమైనది ఇలలో లేదు .
( నీ ఋణం తీర్చుకోలేనిది తల్లీ ! )
******
No comments:
Post a Comment