సంధ్యా కెంజాయలోని సౌందర్యాలను తిలకిస్తూ
ఆదమరచి ఆలోచనల్లో లీనమయిన
నా మనసును తట్టి లేపిన
ఈ తుంటరి ఎవరూ ?
మోము చూడ మునుపెన్నడో
చూచినట్లు తోచె ..!
నవ్వులోన మరుమల్లెలు
కోకొల్లలుగా పూచె ...!
మనసులోన చిలిపి
భావ వీచికలు వీచె ...!
స్పర్శ చలచల్లగా
నను మైమరపించె ...!
కనులలోని కోటి కాంతులు
నను పిలిచినట్లు తోచె ...!
ఎవరూ ..అతగాడు...?
ఓ ! నా మామ కదూ !
నను ఆకర్షించి , చనువుగా నా దరి చేరి
మురిపించి , మరపించి , అలరించు వాడు
అందాల ఆ మామ
నా చందమామ కాక మరెవ్వడు ...?
********
అందుకోలేని ఆ మామ ఇంకెవ్వరూ..మీ (మన) మామే:-))
ReplyDeleteమంచి బావుకత ఉన్న కవిత బాగుంది దేవీ,
మీ చల్లని అభినందనకు ధన్యవాదములు మీరజ్ .
ReplyDeleteమల్లెలు పూచిన నవ్వులు, చిలిపిభావాల చల్లని చిరువెన్నెల స్పర్శ .... మురిపించి మరిపించి అలరించే సౌందర్యం .... ఆదమరచి ఆలోచనల్లో లీనమయిన మనసును తట్టి లేపే తుంటరి ఎవరో కాదు .... ఆ వెన్నెల రేడే!
ReplyDeleteచాలాబాగా పొందికగా ఉంది వర్ణన
అభినందనలు శ్రీదేవి!
మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు . శుభోదయం .
Delete