Tricks and Tips

Saturday, December 7, 2013

ఇంకా K.G క్లాసే నేను .....!



అమ్మ నన్ను లాలిస్తూ డాక్టర్ అవ్వాలన్నది ,
నాన్న నన్ను ఆడిస్తూ ఇంజనీర్ అవ్వాలన్నారు ,

నానమ్మ నవ్విస్తూ పోలీస్ అవ్వాలన్నది ,
తాతయ్య దీవిస్తూ తాసిల్దార్ అవ్వాలన్నారు ,

అమ్మమ్మ తినిపిస్తూ టీచర్ అవ్వాలన్నది ,
తాతయ్య ఒడిలో పెట్టుకొని R.J.D అవ్వాలన్నారు ,

పెద్దమ్మ ముద్దిస్తూ లాయర్ అవ్వాలన్నది ,
పెదనాన్న బుగ్గలు పట్టి యాక్టర్ అవ్వాలన్నారు,

చిన్మమ్మ జోకొడుతూ కలెక్టర్ అవ్వాలన్నది ,
చిన్నాన్న ఎగరేస్తూ R.D.O అవ్వాలన్నారు ,

మామయ్య ఎత్తుకొని ప్రొఫెసర్ అవ్వాలన్నాడు ,
అత్తయ్య అందుకుని మోడల్ కావాలన్నది .

నా చిన్ని బుర్రను అందరు కలిసి 
చిందర వందర చేశారు ,
నన్ను గందరగోళం చేశారు. 

ఒక్కరు నన్ను హాయిగా ఆడుకోమని అనలేదు ,
ఏమవ్వాలో ? ఏమో నేనూ ?
ఇంకా K.G క్లాసే నేను .....!

*********

5 comments:

  1. అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, చిన్మమ్మ, చిన్నాన్న, మామయ్య, అత్తయ్య ఎన్నెన్నో అనుకున్నారు నేనేదేదో కావాలని. నా చిన్ని బుర్రను అందరూ కలిసి చిందర వందర చేశారు, నన్ను గందరగోళం చేశారు. ఒక్కరూ నన్ను హాయిగా ఆడుకోమని అనలేదు, ఏమవ్వాలో? ఏమో నేను? .... ఇంకా ఖ్.ఘ్ క్లాసే నేను .....!

    చెప్పిన విధానం చాలా బాగుంది పసి మనసు పసి పలుకుల్లా ....
    అభినందనలు శ్రీదేవి గారు! సుప్రభాతం!!

    ReplyDelete
    Replies
    1. చంద్ర సర్ ! పిల్లల్ని తల్లిదండ్రులు రేసు గుర్రాల్లా పెంచుతున్నారు .

      వారి పసితనాన్ని ప్రక్కకు తోసేస్తున్నారు . వీరి కసితనాన్ని

      వారిపై రుద్ది ,మొండితనంతో వారిని హింసిస్తున్నారు .

      మీ అభినందనలకు కృతజ్ఞతలు .

      Delete
  2. మొదట మంచి స్టూడెంట్ అవ్వాలి అప్పుడు చూస్తాం , ఏమవుతుందో..(టీచర్ ని కదా:-) )
    కె.జీ. లో అయితేనే వింటారు అందుకే మనకు తోచింది చెప్పేసుకోవచ్చి,
    బాగుంది దేవీ మంచి కవిత. (మా చంద్ర సర్ మెచ్చుకున్నారు కదా ఇంకా బాగుందని అర్దం.)

    ReplyDelete
  3. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను , ఎందుకంటే నేనూ టీచర్నే మీరజ్ .

    ReplyDelete
  4. పిల్లల గూర్చి ఎక్క్కువ ఆలోచించేది మనమే మరి.

    ReplyDelete