(ఇది జానీపాషాగారి చిత్రం )
అమ్మా , నీ మనసులో అమృతం ,
నీ ప్రేమలో నిష్కల్మషం ,
నీ ప్రేమలో నిష్కల్మషం ,
నీ ఆదరణలో ఆదర్శం ,
నీ ఆచరణలో త్యాగం ,
నీ ఆచరణలో త్యాగం ,
నీ పిలుపులో అమరత్వం ,
నీ రూపంలో దైవత్వం ,
నీ రూపంలో దైవత్వం ,
అమ్మా ! నీ ఋణము తీర్చుకొనగ
నాకో సదవకాశమిచ్చావా ?
నాకో సదవకాశమిచ్చావా ?
నా ఒడిలో పరుండగ ,
నా బిడ్డ కడుపునుదయించావా ?
నా బిడ్డ కడుపునుదయించావా ?
నా ఇంట నడయాడగ ,
నా చిట్టితల్లిగ వేంచేసినావా ?
నా చిట్టితల్లిగ వేంచేసినావా ?
నా మాతౄణమీరూపేణ ,
కొంత అయిన మాపనెంచావా...._/\_
కొంత అయిన మాపనెంచావా...._/\_
********
కవిత చాలా బాగుంది,
ReplyDeleteహృఉదయాన్ని కదిలించింది, కవయత్రికీ, చిత్రకారునికీ అభినందనలు.
తాను వేసిన బొమ్మల్లో అందాన్ని చూపేవి ఉన్నా ఆత్మీయతని చూపించే వాటిని ఎన్నుకోవటములో మీ ఎన్నిక మిన్న.
మీరజ్ మీ హృదయాన్ని కదిలించగలిగాను,చాలా సంతోషం. అభినందనలకు ధన్యవాదములు.
Deleteఅమ్మను ప్రస్తుతిస్తూ రాసిన పోస్టింగ్ లో అనురాగం ఆత్మీయత నిండుగా ఉన్నాయి. సరిగ్గా చిత్రం లోనూ అదే నిండుతనం
ReplyDeleteచాలా బాగా నచ్చాయి(చిత్రకారుడు జానీ పాషా గారికి అభినందనలు)
ఒక మంచి పొస్టింగ్ మాతృదినోత్సవం సందర్భం గా అందించినందుకు .... అభినందనలు శ్రీదేవీ!
చంద్రగారు మీ ఆత్మీయాభినందనలకు ధన్యవాదములు.
Delete