Tricks and Tips

Monday, May 12, 2014

జీవితం విలువ తెలిసుకోలేక........


మొన్నా మధ్యన నేను ఐ.సి.యు లో ఉన్న పేషంట్ కోసం ఒక 
హాస్పిటల్లో పది రోజుల పాటు ఉండవలసి వచ్చింది. అదే 
సమయంలో మా పేషెంట్ బెడ్ ప్రక్కన పదహారు సంవత్సరాల
అమ్మాయి మొత్తం శరీరమంతా కట్లు కట్టేసి ఉన్నాయి. ఆ 

అమ్మాయికి ఏమయింది ? అని ఒక నర్సును అడిగాను. 
దానికి సమాధానంగా ఆమె చెప్పిన విషయం విని నాకు 
నోట మాట రాలేదు.ఇంతకీ విషయమేమంటే "ఆ అమ్మాయి 
వేరే ఊరిలో కాలేజీ హాస్టల్లో ఉండి చదవుకోవాలని వాళ్ళ 
అమ్మానాన్న ఆమెకు నచ్చచెప్పి,భవిష్యత్తు బాగుంటుందని 
వివరించి ఆ కాలేజీలో చేర్పించారని కోపంతో,పంతంతో ఆ కాలేజీ 
పైకెక్కి అయిదంతస్థుల పై నుండి దూకేసిందట,వెన్నెముక 
రెండు చోట్ల  విరిగిపోయిందట,కాళ్ళుచేతులు విరిగిపోయాయి,
తల పగిలింది,జీవితాంతం మంచం మీదే ఉండవలసిన పరిస్థితి 
వాళ్ళ అమ్మానాన్నకు ఆ అమ్మాయి లేకలేక కలిగిన ఏకైక 
సంతానమంట"..........అప్పుడు నేను ఆ అమ్మాయిని తేరిపారా 
చూశాను,చాలా బాగుంది , కొంచమైనా తను చేసిన పనికి 
బాధపడడం లేదు సరికదా ,అమ్మానాన్నతో తనను ఏ.సి 
రూంలోకి షిఫ్ట్ చేస్తేనే వస్తానని లేకుంటే ఐ.సి.యు నుండి రానని 
మంకు పట్టు పడుతోంది. ఏ.సి రూములు ఖాళీలేవని ఎంత  
చెప్పినా మొండిగా మూర్ఖంగా వాదించి రెండురోజుల తర్వాత ఏ.సి
రూం ఖాళీ అయిన తర్వాతే తను రూం మారింది.రూంలో టీ.వి 

ఉండాలట,తనకు  నచ్చిన సినిమాల సీ.డీలు తేవాలట , ఆహారం 
తనకు నచ్చిందే తింటుందట , ఇలా ఆ అమ్మాయి చెప్పిందే 
తడవుగా తల్లిదండ్రులిద్దరూ తలూపేస్తూ పరుగులు తీస్తున్నారు 
పిచ్చెక్కినట్లు....ఒక్కగానొక్క పిల్ల లేకలేక కలిగింది కదా అని 
విపరీతంగా వారు చేసిన గారభం ఫలితమని చూసినవారెవ్వరికైనా 
ఇట్టే తెలుస్తుంది ,"చిన్నప్పటి నుండీ అంతేనండి చిలిపితనం 
ఎక్కువండి" అంటూ ప్రక్కనున్న వారితో మురిపెంగా తమ బిడ్డను 
చూస్తూ  అంటుంటే , చిలిపితనమంటే ఇదా అనిపించింది నాకు ,
అంతే కాదు ఆ తల్లిదండ్రుల మీద చాలా జాలేసింది కూడా . ఆ 
అమ్మాయి జీవితాంతం మంచంలో ఉండి వీళ్ళకు క్షణానికొక 
నరకం చూపిస్తుంది ,తల్లిదండ్రుల ప్రేమను అర్ధం చేసుకోక  
భవిష్యత్తును శూన్యం చేసుకుని ,పశ్చాత్తాపమన్నది లేకుండా
అజ్ఞానంలో కొట్టుకుపోతూ అదేదో ఘనకార్యమని ఫీలవుతూ,
తామేమి కోల్పోయామో తెలుసుకోలేక జీవితం విలువ 
తెలిసుకోలేక పోతుంటారు కొందరు ఇలా.  నేను హాస్పిటల్ 
నుండి వచ్చేసాను , తర్వాత ఏం జరిగిందో మరి.................
*************

6 comments:

  1. శ్రీ దేవి గారూ
    హృదయాన్ని కదిలించి....
    కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు గదా

    *శ్రీపాద 

    ReplyDelete
    Replies
    1. ఇక ఆ తల్లిదండ్రుల పరిస్థితి తలచుకుంటే..............
      మీ అభినందనలకు ధన్యవాదములు శ్రీపాదగారు.

      Delete
  2. valla kanti thadini gurchi thaanu okka kshanam alochinchinaa ..... avi aanadhapu virijalluga thana jeevithamlo anandhapu siri varsham kuripinchevi !! yevarina sare ye pani chese mundhayina okka kshanam alochinchaali !!

    ReplyDelete
    Replies
    1. మన్విమను గారు నా బ్లాగుకు స్వాగతమండి , మీ స్పూర్థిదాయకమైన స్పందనకు ధన్యవాదములు.

      Delete
  3. పరిణతి లేని ఎదగని పసి మనసు, తల్లిదండ్రుల పిచ్చి ప్రేమ

    ఎవరినని దోషి అని చెప్పలేని స్థితి
    ఇలాంటి ఎందరో .... ఈ ప్రపంచం లో

    తియ్యని బాధ మదిని కలిచివెయ్యక తప్పదు. మార్పు క్రమశిక్షణ ఆశించినప్పుడు, ఈ సమాజం లో

    ReplyDelete
    Replies
    1. పిచ్చిప్రేమ తగదని పెద్దవాళ్ళు తెలుసుకోవాలి.మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.

      Delete