సఖీ !
అరవిచ్చిన నీ పెదవుల చిరుదరహాసం చూసి
వికసించిన సుమములు వెలవెలబోగా ,
సంతోషంతో విప్పారిన నీ మోమును కని
పున్నమి చంద్రుడు వెలిసిపోగా ,
అనురాగంతో కూడిన నీ వాక్కుల వింటే ,
అన్ని రాగములు అల్పమేగా ,
మధురమైన నీ స్వరమును విన్న
కోకిల కంఠం మూగపోగా ,
సున్నితమైన నీ ఆదరణ ముందు
మల్లెల సునిశితత్వం తరిగిపోగా ,
ప్రేమను వర్షించే నీ కనులను చూసి
నీలిమేఘాలు అలిసిపోగా ,
నీ ఆత్మీయ సాహచర్యంలో
ఒంటరితనము నను వీడిపోగా ,
నా సువిశాల హృదయసామ్రాజ్యం నీ రాకతో
చిన్న కుటీరమై స్వాగతించగా ,
నాకై దిగివచ్చిన నా ప్రకృతి
నీ రూపంలో విచ్చేసిన సఖీ ,
నీ దారులలో పూలుపరిచా
నీకిదే నా స్వాగతం........
అరవిచ్చిన నీ పెదవుల చిరుదరహాసం చూసి
వికసించిన సుమములు వెలవెలబోగా ,
సంతోషంతో విప్పారిన నీ మోమును కని
పున్నమి చంద్రుడు వెలిసిపోగా ,
అనురాగంతో కూడిన నీ వాక్కుల వింటే ,
అన్ని రాగములు అల్పమేగా ,
మధురమైన నీ స్వరమును విన్న
కోకిల కంఠం మూగపోగా ,
సున్నితమైన నీ ఆదరణ ముందు
మల్లెల సునిశితత్వం తరిగిపోగా ,
ప్రేమను వర్షించే నీ కనులను చూసి
నీలిమేఘాలు అలిసిపోగా ,
నీ ఆత్మీయ సాహచర్యంలో
ఒంటరితనము నను వీడిపోగా ,
నా సువిశాల హృదయసామ్రాజ్యం నీ రాకతో
చిన్న కుటీరమై స్వాగతించగా ,
నాకై దిగివచ్చిన నా ప్రకృతి
నీ రూపంలో విచ్చేసిన సఖీ ,
నీ దారులలో పూలుపరిచా
నీకిదే నా స్వాగతం........
******
ఎంత భావుకత ఉందో అక్షరాలలో..,
ReplyDeleteఅందమైన కవిత మది దోచింది.
మీ ప్రోత్సాహకాభినందనలకు ధన్యవాదములు మీరజ్.
Deleteతెలుగు తియ్యదనం పదాలకద్దేశారే!!
ReplyDelete-ఓచిన్నమాట
Thank you npuvvadagaru.
Delete