Tricks and Tips

Wednesday, May 21, 2014

తొలివలపులు..........


చిరు చిరు తలపులు
తొలివలపులనే సుతిమెత్తగ తట్టి లేపగా ,
 

వలపుల తలపులు
హృదయాంతరాలను సుతారముగ తాకగా ,
 

హృదయం తలుపులు తెరచి
స్పందనలను తనలో పొదవుకొనగా ,
 

తలుపులు దాటి ఆ స్పందనలు.....
 

కన్నులలో తారకలై ,
చేతులలో రాతలై ,
చేతలలో ఆశలై ,

బుగ్గలలో నునుసిగ్గులై ,
 
ఊహలలో ఉలికిపాటులై ,
 పలుకులలో పరవశమై ,
 మేనిలో పులకరింతలై ,
ఒంటరితనంలో పలవరింతలై ,
నిద్దురలో కలవరింతలై ,
 

మనసులో మధుర భావాలై ,
నిలువరించనీకున్నాయి ,
ఓపలేకున్నాయి ,
దాచలేమన్నాయి.......

****

2 comments:

  1. భావనలు తారకలు, రాతలు, ఆశలై, నునుసిగ్గులై, ఒంటరి పలవరింతలు, నిద్దుర కలవరింతలై

    ఎంత చక్కని చిక్కని భావనావేశం కవిత గా
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.

      Delete