Tricks and Tips

Sunday, May 25, 2014

నీ సొంపుల మేని ఒంపులలో............

నీ చిరునవ్వుల వెన్నెలలో
సిరిమల్లెలు కొల్లలు ఏరుకోనా.....

నీ కమ్మని కోకిల మాటలలో
కుహు కుహు రాగాలు ఏరుకోనా.....

నీ సొంపుల మేని ఒంపులలో
నెలవంకల నెన్నో దాచుకోనా.....

నీ చిలిపి చూపుల కన్నులలో
నా రూపము పదిలముగ దాచుకోనా.....

నీ గలగల గాజుల సవ్వడిలో
శుభ"కరకమలములు" అందుకోనా.....

నీ ఘల్లనే అందెల రవళులలో
పాద పద్మములు అందుకోనా.....

నీ హృదయ స్పందనల అలజడిని
శృతి , లయ నేనై సవరించనా.....

నీ భావరాగాల సంధిగ్ధతని
పల్లవి నేనై సవరించనా......

నీవూ నేనూ వేరు కాదని
నేనే నీవని వివరించనా.....

నా వలపుల శరములు సంధించనా
నా బాహువులలో నిను బంధించనా......

********

4 comments:

  1. అమ్మో... ఇలా శ్రుతిమించితే ఎలా.., అసలే వేసవి తాపము బాలా..:-))

    ReplyDelete
    Replies
    1. అభ్యర్ధనలకే అలా భయపడిపోతే ఎలా ..............మీరజ్

      Delete
  2. చిరునవ్వు వెన్నెలలో కొల్లలు సిరిమల్లెలు
    భావరాగాల సంధిగ్ధతను పల్లవినై సవరించనా......
    చక్కని భావనల .... మాల లా బాగుంది పోస్టింగ్
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభినందనల మాలలకు బహుసంతోషం.

      Delete