ఈ మధ్య కాలంలో ఎలక్షన్ డ్యూటీలు వెంటవెంటనే చేసేసరికి నాకు ఆ వాతావరణం పై ఎంతో అసహ్యం వేసింది.
(1) "ఓటు" హక్కు వచ్చిన ప్రతివాడూ హీరోలా ఫీలవ్వడమే.
(2) ఎలక్షన్ డ్యూటీ చేసేవారికి ఏమీ తెలియదు అని ,ఆ జ్ఞానులంతా పెదవి విరవడం...అన్నీ వారికే తెలుసనే గొప్ప నమ్మకం.
(3) ఓటు ఎలా వేయాలో తెలియదు....
(4) ఎలా వేయాలో వివరిస్తే (దూరం నుండే సుమా) ఆ పార్టీవాడికి మీరు మేలు చేయడానికి వచ్చారా?అనే గొడవలు ,రాధ్దాంతాలు .
(5) ఓటు వేయడం ఎలా అనే విషయం పట్ల కనీస అవగాహన కలుగచేసే బాధ్యత ఊరిలో ఒక్క రాజకీయనాయకుడూ తీసుకోడు,
(6) పీకలమొయ్య తాగి వచ్చినవాడు నడవలేక తూలిపోతుంటే,వాడిని లేడీ P.O గారు తీసుకెళ్ళి ఓటు వేయించాలట...!!!
7) ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కడిని గుర్తుంచుకోవాలంట, వాడు మరల వస్తే వాడిని మరల ఎందుకు రానిచ్చారు ? అంటూ ఏజెంట్లు వారి పనిని కూడా ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వారిదే అని మూర్ఖవాదన.....!!!!
(8) ఈ మాత్రం దానికి ఏజెంట్లు ఎందుకో.......వారి విధులేమిటో ............... ?????
(9) చదువురాదు , చెబితే వినరు , మనకు సహకరించరు , తమలో తాము సర్దుకోరు , అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించరు , ఇప్పటికైనా నేర్చుకోరు , ఇ.వి.ఎం ను సహనంతో చూడలేరు , సీల్ వేసేవరకు ఆగలేరు , క్లోజ్ చేసేవరకు నిలవలేరు , ప్రతి చిన్న విషయానికీ విపరీతంగా స్పందించడం , విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ అదేదో వీరోచితమనుకోవడం...........వీరు ఏజెంట్లు .
(10) ఇ.వి.ఎం మెషీన్లో వారి పార్టీకి సంబంధించిన గుర్తు ఎన్నో నంబరులో ఉంటుందో కూడా చెప్పే బాధ్యత తీసికోరు....
(11) ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వారు భోజనం చేస్తే వారికి సమయం వృధా అవుతుందట....!!!
(12) పోస్టల్ బాలెట్ ఉపయోగించుకున్న ఒక అమ్మాయి , తాను వినియోగించుకోలేదు అని చాలెంజ్ ఓటు వేస్తుందట...!!! ఇదో రాధ్దాంతం..........
(13) ఓటు వేయడానికి కంపార్ట్మెంటు లోనికి వెళ్ళిన ఓ వృద్ధురాలు ఇ.వి.ఎం షాక్ కొట్టినట్టు గట్టిగా అరిచేసరికి నేను గాభరా పడిపోయి ఏమిటని అడిగితే ,అన్ని బొమ్మల్ని ఒక్కసారిగా చూసేసరికి తన గుర్తు కనిపించలేదట.......... అందుకే అలా అరిచిందట...???
(14) మరొక ఆమె కంపార్ట్మెంటు లోనికి వెళ్ళి మూర్చ వచ్చినట్లు వణికి పోతోంది నిలువునా ,గబుక్కున పట్టుకుని అడిగితే, తమ పార్టీ గుర్తు చూసేసరికి ఆనందంతో అలా వణికి పోయిందట !!!!!
(15) ఓ యాభై ఏళ్ళ వ్యక్తి తెగతాగి వచ్చి ఓటు వేసి , అక్కడ ఉన్న ఇరవై ఏళ్ళవాడికి తనకు మందు పోయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరిస్తూ వెళ్ళిపోతుంటే ఆ ఓటు విలువ ఒక మందుసీసా అని తెలపకనే తెలుస్తోంది.
(16) భారతదేశానికి పల్లెటూర్లే పట్టుకొమ్మలని , వాటి అభివృధ్దిపైనే దేశాభివృధ్ది ఆధారపడి ఉందని మనం విశ్వసించక తప్పదు , కానీ ఇటువంటి ఊళ్ళలో 90% ఓట్లు పోలవుతుంటే, చదువుకుని జ్ఞానమున్న ప్రజలు నగరాల్లో 70% ఓట్లు పోలవడం నిజంగా హేయకరమైనది .
(17) ఎటువంటి ఓట్ల మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడుతోందో , నాయకులు చక్రం తిప్పడానికి ఎవరు అవకాశం ఇస్తున్నారో తెలుస్తూనే ఉంది.....
(18) ముందే విద్యావంతులు మేల్కొని ఉంటే అసలు ఈ విపరీత పరిణామాలకు అవకాశం ఉండదుకదా , మన అభివృధ్దికి పాటుపడే వారిని ఎన్నుకోవడానికి మనకు ఇంత స్వేచ్ఛ ఉన్నా మన చేతులారా మనం దుర్వినియోగం చేసుకోవడం ఎంతవరకు సమంజసం ? అరాచక శక్తులు విచ్చలవిడిగా ప్రవర్తించడానికి కారణం మనమే కదా.....
(19) చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి అలవాటు పడి , ఓటు వేయని వాడు అప్పుడు మేల్కొని సాధించేది ఏమిటి ?
(20) మరో అయిదేళ్ళు మనం తవ్వుకున్న గోతిలో మనం పడడానికి సంసిద్దులం అయిపోయామనడానికి నిదర్శనం కాదా , అధికారికంగా ఓ అరాచకానికి పట్టం కట్టడడం.....
**************
Very nicely told... Sreedevi garu.
ReplyDeleteశ్రీపాద గారు మీ స్పందనకు ధన్యవాదములు.
Deleteఎలక్షన్ డ్యూటీ అనుభవాలు బాగా చెప్పారు శ్రీదేవి గారు. అక్కడ పోలింగ్ సిబ్బంది గురించి పట్టించుకునే నాధుడే ఉండరు. గ్రామాలలో ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అక్కడ కనీస సౌకర్యాలు ఉండవు. అలాంటి చోట మహిళలు ఎలా పనిచేస్తారో ఆలోచించరు. ఎలక్షన్ డ్యూటీ చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ గారి ఆజ్ఞ. మరో పక్క ఇ.వీ.ఎం లతో తలనొప్పి.
ReplyDeleteఅవి పని చేయకపోవడం, మాక్ పోల్, పోలింగ్ అయిన తర్వాత సీల్ చేయడం, బోలెడు కవర్లను నింపి రాయడం .. అమ్మో రెండు రోజులు రెండు యుగాలు.
ఇంకా నేను సొంత కష్టాలు ఎందుకులే అని రాయలేదు నాగేంద్రగారు,మీరన్నవన్నీ అక్షర సత్యాలు.అది రెండురోజుల పని కాదు ,మొత్తం నాలుగు రోజుల నరకం.వారం రోజుల రోగం, అయినా ఒక ప్రభుత్వోద్యోగిగా మన కర్తవ్యం.
Deleteఇన్ని ఇబ్బందులున్నా, మీ విధి నిర్వర్తించి, ఈ మహా యజ్ఙం లొ పాల్గొన్నందుకు మీకు జోహార్లు; ధన్యవాదములు.
ReplyDeleteకిషోర్ గారు నా బ్లాగుకు స్వాగతం.సహృదయంతో అర్ధం చేసుకుని స్పందించినందుకు ధన్యవాదములు.
Delete
ReplyDeleteఓటు హక్కు విలువ తెలియని ప్రతి ఒక్కరు చదివి ఆలోచించాల్సిన పోస్టింగ్, మనం తవ్వుకున్న గోతిలో మనం
మనిషి బలహీనతలు అమాయకత్వం మోసమయమైన ఈ తంతు ను గమనిస్తే
ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టడం సాధ్యమా అనిపిస్తుంది.
ఏవైపు వెళుతున్నామో మనం అని
అభినందనలు శ్రీదేవీ!
చంద్రగారు మీ విశ్లేషణాత్మకమైన అభినందనలకు ధన్యవాదములు.
Delete