Tricks and Tips

Wednesday, May 14, 2014

పసితనం మరణిస్తే .................

ఏం పాపం చేశానో అమ్మా ?
నీ చేతులారా నీవు నన్ను
పురిటిగుడ్డుగా పొదల్లోకి విసిరేసి
నా పసితనాన్ని చంపేస్తే ,

నా బాల్యం అంతా
మురికివీధుల్లో మరణించింది ,
 
నా యవ్వనమంతా
చీకటి గదుల్లో చనిపోయింది ,
 
నా నడివయసంతా రోగాలతో
నడివీధుల్లో అసువులు బాసింది ,
 
నా వృద్ధాప్యమంతా నరకయాతన నుండి
విముక్తి కొరకు క్షణమొక యుగముగ
మరణం కొరకు ప్రార్ధిస్తూ ఉన్నా.........

అల్లరుముద్దుగా పెంచుకునే బిడ్డలను
అర్ధాంతరంగా కబళించే మృత్యువు
నా అచేతనావస్థను చూసికూడా
నా దరిచేర రాదెందుకో............

"కన్నతల్లిచే వదిలివేయబడిన బిడ్డనని
నాపై చులకన భావం కావచ్చు"

 
******

2 comments:

  1. కన్నతల్లిచే వదిలివేయబడిన బిడ్డనని మరిచిపోలేక పోవడానికి తన అస్తిత్వం తో పాటు సమాజం కూడా కొంతవరకు కారణం

    మానసికం గా కానీ సామాజికం గానీ మార్పు వస్తే గానీ మంచి జరగదు
    అభినందనలు శ్రీదేవి! చక్కని పోస్టింగ్!

    ReplyDelete
    Replies
    1. మీరన్నట్లు మార్పుతోనే ఏదైనా సాధ్యం , అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.

      Delete