Tricks and Tips

Wednesday, May 28, 2014

నా తల్లీ....లాలీ....లాలీ....

(ఇది జానీపాషాగారి చిత్రం )

జోజో....లాలీ....లాలీ....లాలీ....లాలీ....
నా తల్లీ....లాలీ....లాలీ....లాలీ....లాలీ....

ఆకశాన
అందాలమామ
              నీకై వేచి ఉన్నాడమ్మా       ll జోజో ll
 
వెన్నెలలోన
జాబిలి మామ
     చిరునవ్వులు నీకై రువ్వెనమ్మా       ll జోజో ll

నవ్వుల అలలే
ఆ చందమామ 
             చిరుగాలిగ నీకై పంపెనమ్మా      ll జోజో ll
 
జిలిబిలి తారలు
ఆ జాబిలినొదిలి
                  నీకై చేతులు జాచెనమ్మా        ll జోజో ll


నా చేతులనే
నీ ఊయల చేసి
                   తారా , జాబిలి ఊపిరమ్మా        ll జోజో ll

చల్లని మామా
వెలుగుల తారలు
                          నీకై జోల పాడెనమ్మా          ll జోజో  ll


హాయిగ బజ్జో
ఊగుతు బజ్జో
                    జాబిలి నీ జత ఉన్నాడమ్మా     ll జోజో ll
 
*****

4 comments:

  1. మీ జోల(లాలి) పాట చాలా బావుంది శ్రీదేవి జీ ....

    ReplyDelete
    Replies
    1. శ్వేతగారు మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  2. ఈ చిత్రం నాకెంత ఇష్టమో...,
    మీ లాలి పాట దానికి చక్కగా అమరిపోయింది.
    దేవీ చాలా బాగుంది పాట.

    ReplyDelete
    Replies
    1. చిత్రకారుని కంటే ముందు మీరు మెచ్చుకున్నందుకు సంతోషం మీరజ్.

      Delete