Tricks and Tips

Sunday, May 18, 2014

నే తోడుంటానమ్మా......


 ఎందుకమ్మా ! నను వద్దనుకుంటున్నారు ?

అమ్మా ! నను చంపొద్దమ్మా ......
మీ ప్రేమకు నను దూరం చేయొద్దమ్మా ,

అమ్మా ! నీ మాటే నే వింటానమ్మా ,
నాన్నా ! నీ తల్లిని నే వస్తున్నా నాన్నా ,

నీ ఒడిలో నేను ఆడుకుంటానమ్మా , 
నీ గుండెల్లో నేను పడుకుంటా నాన్నా ,

నా రెండు కళ్ళుగ మిము ప్రేమిస్తానమ్మా ,
నను చిరుదశలో చిదిమేయొద్దమ్మా ,

మీ చివరంటూనే తోడుంటానమ్మా ,
అమ్మా ! నను చంపొద్దమ్మా ......


********

2 comments:

  1. పసి మనసు ఆస్వాసన జీవించాలనే తపన ప్రతి పదం లోనూ కనిపిస్తున్నాయి
    అభినందనలు శ్రీదేవీ! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. ప్రోత్సాహకాభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.

      Delete