Tricks and Tips

Saturday, May 24, 2014

నా బంగరు భవితను చేరుకుంటా..............

 నా చిలిపి చేష్టలతో దాక్కొని
నిను ఆశ్చర్య పరచాలనుకున్న నేను ,
నీ "లోపలి" మనిషిని చూసి నివ్వెరపోయాను.....

నీ మాటలు బూటకమని ,
నీ ప్రమాణాలు నాటకమని ,
నీవు ధనదాహానికి బానిసవని ,
నీవు కర్కోటక కామపిశాచివని......
తెలిసి విస్తుపోయాను.......


నా చిలిపిచేష్టలే నాకు మేలు చేశాయి ,
నా చిన్నతనపు ఆలోచనలే నన్ను మేల్కొలిపాయి....

నా మదిలో ఆశలు ఆవిరి అయినా ,
నా ప్రేమలో నిజాయితి నీరై పోయినా , 
బలిగాబోతున్న నా భవిష్యత్తును ,
భద్రంగా కాపాడుకున్నా.........

నా తల్లిదండ్రుల ఆశయాలకు వారధినవుతా ,
నా బంగరు భవితను చేరుకుంటా..............

********

2 comments:

  1. నా తల్లిదండ్రుల ఆశయాలకు వారధినయ్యి, ఒక బంగరు భవితను చేరుకుంటా....
    ప్రతి యువకుడూ ప్రతి యువతీ ఆలోచించి ఆచరించాల్సిన భావన
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. ప్రతి ఒక్క ఆడపిల్ల తన తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవాలి.మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.

      Delete