Tricks and Tips

Tuesday, May 13, 2014

ఒక్కసారి ఆలోచించండి...........


అవును , ఓ విత్తు నాటడం కష్టం , అదే పీకడం చాలా సులువు .
ఎందుకంటే నాటడానికి ఓ పద్ధతి ఉంటుంది , అదే పీకడానికి
ఉండదుగా . అలానే ఇంటిని నిర్మించుకోవడం చాలా కష్టం ,
అదే కూలగొట్టడమైతే ఎంతో తేలిక .ఇంకా చెప్పాలంటే ప్రాణం 
పోయడం చాలా కష్టం , అదే తీసుకోవడం/తీయడం చాలా  
సులభం .తల్లి నవమాసాల కాలంలో ఒక్కొక్క రోజు ఒక్కొ
క్క 
అనుభూతిని పోగుచేసుకుంటూ , ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని 
ఇష్టంగా స్వీకరిస్తూ , రేపటి రోజును గూర్చి కలలుకంటూ,
బిడ్డకు అవసరమైన పోషకాలను తన శక్తి కొలది తింటూ , 
ఆప్యాయంగా తన కడుపును నిమురుకుంటూ ,అమ్మతో 
తన ఇబ్బందులను చర్చిస్తూ , తీసుకోవలసిన జాగ్రత్తలను 
తెలుసుకుంటూ , ఇరుగు పొరుగు వారితో పంచుకుంటూ ,
తనకు సంబందించిన చిన్న వార్తనైనా చదివేస్తూ , టీ.వీ లో
గర్భిణీల గూర్చి చెబుతుంటే వినేస్తూ , డాక్టరుగారితో తన 
ఆరోగ్యం గూర్చి తెలుసుకుంటూ ,రోజులను లెక్కించుకుంటూ , 
భర్త ఆసరాతో భారంగా అడుగులేస్తూ ,జాగ్రత్తగా కూర్చుంటూ , 
నిదానంగా లేస్తూ , అమ్మ వద్దకొచ్చి తొమ్మిది నెలలు పూర్తి 
చేసుకుని నిండు గర్భిణి ఆస్పత్రిలో పండంటి బిడ్డను ప్రసవించి ,
పరిపూర్ణ మాతృత్వం ముఖం లో తొణికిసలాడగా , బిడ్డ ఏడ్పుతో 
గుండెల్లోస్పందనలు రెట్టింపవ్వగా , తన ఆశాజ్యోతిగా ,కనులపంటగా 
పెంచుకున్నతల్లి , పొత్తిళ్ళల్లో , పారాడేటప్పుడు , బుడిబుడి నడకలు 
నడిచే వయసులో నీ నీడలా నడయాడిన తల్లి , గోరుముద్దలు తినిపిస్తూ , 
జోలపాటలు పాడేస్తూ , నీ ఆలనాపాలనలో తనను తాను మరచి పెంచిన 
తల్లి , నిను పాఠశాలకు పంపిస్తూ , నీతి కథలు చెప్పేస్తూ  నీ బాల్యాన్ని 
కంటికి రెప్పలా కాచిన తల్లి...........
 

యుక్తవయసుకు వచ్చిన నీకు విద్య విలువను వివరిస్తూ , పోటీప్రపంచంలో 
అలక్ష్యం తగదని నీ భవిష్యత్తుకై నీతో పలికిన ఆ నాలుగు మాటలు
పట్టుకుని విద్య పట్ల అసహ్యం పెంచుకుని , తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ
ఇల్లొదిలి , ఊరొదిలి , రాష్ట్రాలను దాటి పోయేవాళ్ళు , పురుగుమందు తాగేవాళ్ళు ,
 నిద్రమాత్రలు మింగేవాళ్ళు , రైలు కింద పడే వాళ్ళు , ఉరేసుకునేవాళ్ళు ,
నీళ్ళలో దూకేవాళ్ళు , కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేవాళ్ళు............

 

ఇందుకోసమా ! అమ్మ అన్ని బాధలను ఓర్చుకుని జన్మనిచ్చింది ?
తను తిన్నా తినకపోయినా బిడ్డల కడుపు చూస్తూ ,వారి చదువు కోసం
పడవలసిన కష్టాలన్నింటిని ఇష్టంగా భరిస్తూ , వారు భవిష్యత్తులో
ఉన్నతస్థితికి చేరుకోవటాన్ని చూసి మురిసిపోవాలనే ఆరాటంలో అన్న  
ఆ నాలుగు మాటలు పట్టుకుని పిల్లలు ఇలా మూర్ఖంగా ప్రవర్తించి , మిమ్మల్ని 
వరాల్లా భావించిన  ఆ తల్లిదండ్రులకు శాపాన్నిస్తారా ? ఆ నాలుగు మాటలు 
వెనుక ఉన్న ఆరాటాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించరా ? 
అమ్మానాన్నల వద్ద ఇగో ఫీలింగా ?


మాతృత్వం వరంలా భావించి ఆ తల్లి జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తుంటే ,
 పెరిగిన పిల్లలు ఆ తల్లిదండ్రులకు ఇచ్చే శాపాలు....చూపే నరకాలు ఇవా ?
మీ బాధ్యతారాహిత్య ప్రవర్తనకు వారిని ఆ వయసులో బలి చేయడం ఎంత
 వరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించండి...........


************

4 comments:

  1. శర్మ కాలక్షేపంకబుర్లు-శీతకన్నేయకండి!

    ReplyDelete
  2. ఒక్కసారే కాదు ఎన్నిసార్లు ఆలోచించినా నిజం మాత్రం
    మనిషి మాను లా బ్రతకడం మాత్రమే జీవితం కాదు కన్నవారిని, సమాజాన్నీ కూడా తనతో పాటు సంరక్షించుకునే మనస్తత్వం ప్రతి ఒక్కరిలోనూ పెరగాలి.
    చక్కని పొస్టింగ్ శ్రీదేవీ! అభినందనలు

    ReplyDelete
    Replies
    1. మీ సూచన బాగుంది , అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.

      Delete