Tricks and Tips

Thursday, May 29, 2014

నీవు , రామ్మా చిలకమ్మా...............

పచ్చని చిలకమ్మా ,
నా నేస్తం నీవమ్మా ,
నీ పచ్చని రంగు కొంచెం తీసి ,
ప్రకృతికివ్వమ్మా ..........

కిలకిల చిలకమ్మా ,
నా దరికి రావమ్మా ,
చిన్ని చిన్ని మాటలు నీకు ,
నేర్పిస్తానమ్మా .........

చిట్టి చిలకమ్మా ,
నాకిష్టం నీవమ్మా ,
చెట్టు మీది పండ్లన్నీ ,
నీవే తినకమ్మా .........

రామచిలకమ్మా ,
నీవు , రామ్మా చిలకమ్మా ,
తియ్యని పండు తీసుకొచ్చి ,
సాహిల్ కివ్వమ్మా ..........

చక్కని చిలకమ్మా ,
నువ్వు హాయిగ ఎగురమ్మా ,
ఆకాశంలో ఎగురుతు నీవు ,
హాయిగ ఉండమ్మా............
 
******

2 comments:

  1. చిట్టి చిలకమ్మా..నీ రాక మాకెంతో సంతోషం సుమా..,

    ReplyDelete
    Replies
    1. చిట్టిచిలకమ్మ సాహిల్ కోసం వచ్చింది మీరజ్.

      Delete