Tricks and Tips

Thursday, May 22, 2014

రైతన్న ప్రసాదించిన అన్నప్రసాదమేగా.......

ప్రణతి ప్రణతి అంటూ
ప్రకృతినే నమ్ముకున్న రైతన్న ,

ప్రతిక్షణం ప్రతికూలించకు అంటూ
ప్రణమిల్లే రైతన్న ,

ప్రతి రైతు ప్రతినిధి నీవే అంటూ
ప్రతిపాదన చేసే  రైతన్న ,

ప్రతిఘటించు శక్తి లేక
ప్రదక్షిణ చేసే  రైతన్న ,

ప్రళయకాల వేళలందు
ప్రత్యామ్నాయాన్నాశ్రయించే  రైతన్న ,

ప్రజల కొరకు అహర్నిశలు
ప్రయాసపడే  రైతన్న ,

ప్రసవించిన తల్లి పాల అనంతరం , రైతన్న
ప్రసాదించిన అన్నప్రసాదమేగా మన జీవనాధారం ,


ప్రతిభావంతులమైనా ,
ప్రజ్ఞావంతులమైనా ,
ప్రయోజకులమైనా ,
ప్రతిసృష్టి చేసినా ,


ప్రస్తుతించాలి మనం  రైతన్నను ,
ప్రణుతించాలి మనం  రైతన్నను .

******

6 comments:

  1. ప్రసవించిన తల్లి పాల అనంతరం , రైతన్న
    ప్రసాదించిన అన్నప్రసాదమేగా మన జీవనాధారం...... ఎంత బాగా చెప్పారు శ్రీదేవి .... చాలా బావుంది మీకవిత :)

    ReplyDelete
    Replies
    1. sweta vasukigaru మీ స్పందనకు ధన్యవాదములండి .

      Delete
  2. Replies
    1. రమణారెడ్డిగారు నా బ్లాగుకు స్వాగతమండి . మీ స్పందనకు ధన్యవాదములండి .

      Delete
  3. ప్రసవించిన తల్లి పాల అనంతరం, రైతన్న ప్రసాదించిన అన్నప్రసాదమేగా మనిషి జీవనాధారం ,
    చాలా బాగుంది భావన .... కవిత
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.

      Delete