అమ్మ గుప్పెడు గుండెను
అర్ధం చేసుకోని మనసెందుకో ?
అమ్మకు పిడికెడు అన్నం పెట్టని
సిరిసంపదలు ఎందుకో ?
అమ్మను కనులారా చూడని
కంటి దృష్టి ఎందుకో ?
అమ్మా అని నోరారా పిలవని
స్వరం ఎందుకో ?
అమ్మను నిర్లక్ష్యం చేసి
ఆ పరమాత్ముని కొరకు పరుగులెందుకో ?
అమ్మను మించిన దైవం
ఉందనే అజ్ఞానం ఎందుకో ?
******
అమ్మను అర్ధం చేసుకోగలిగితే అదే గొప్ప జ్ఞానం .... నిజం
ReplyDeleteఅభినందనలు శ్రీదేవీ! చక్కని పోస్టింగ్!
మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.
Delete